తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి( Chiranjeevi ) లాంటి స్టార్ హీరోలు సైతం ఒకప్పుడు రుద్రవీణ, ఆపద్బాంధవుడు,స్వయం కృషి లాంటి సినిమాలు చేసి ఒక ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్నారు.
ముఖ్యంగా చిరంజీవి మాస్ హీరోగా ఉన్న సమయంలో ఇలాంటి ఎక్స్పరమెంట్లు చేసి నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు ఇలాంటి చిరంజీవి ఇప్పుడు మాత్రం రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో నటిస్తున్నాడు.
ఎక్స్పరిమెంట్లు చేయడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఎందుకు అంటే ప్రస్తుతం ఆయనకి హిట్స్ మాత్రమే కావాలి.
దాదాపు మూడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో మెగాస్టార్ గా కొనసాగిన చిరంజీవి ఇప్పుడు కొత్తగా నటనపరంగా ప్రూవ్ చేసుకోవాల్సిందేమీ లేదు కాబట్టి ప్రస్తుతం స్టార్ డం కాపాడుకోవాలని చూస్తున్నారు.అందులో భాగంగా వస్తున్న సినిమాలే ఈ వాల్తేరు వీరయ్య భోళా శంకర్ ( Bhola Shankar )లాంటి సినిమాలు చేస్తూ చిరంజీవి ఇండస్ట్రీలో సర్వైవల్ అవుతున్నారు.
ప్రస్తుతం ఆయన వశిష్ట డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు.అలాగే మారుతి( Maruthi ) డైరెక్షన్ లో మరో సినిమా చేయబోతున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది.అయితే ఈ సినిమా అనేది మారుతి ప్రభాస్ తో చేస్తున్న సినిమా సక్సెస్ మీద ఆధారపడి ఉంటుందని కూడా తెలుస్తుంది.
ఇక మొదటి నుంచి చిరంజీవి ప్రతి సినిమాకు సంబంధించిన స్టోరీని తనే దగ్గరుండి డైరెక్టర్లతో కూర్చొని మార్పులు,చేర్పులు చేయిస్తూ అవసరమైతే తన ఆస్థాన రచయితలు అయిన పరుచూరి బ్రదర్స్ ని కూడా కూర్చోబెట్టి ఆ స్క్రిప్ట్ ని మరింత బెస్ట్ గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.ఇప్పుడనే కాదు చిరంజీవి ప్రతి సినిమా సమయంలో కూడా పరుచూరి బ్రదర్స్ ఇన్వాల్వ్ మెంట్ ఎంతో కొంత ఉంటుందని చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక డైరెక్టర్లు అయితే పరుచూరి వాళ్ల ఇన్వాల్వ్మెంట్ తో వాళ్ళు అనుకున్న కథకి వాళ్ళు చెప్పే సజెషన్స్ కి అసలు సంబంధం లేకపోవడంతో తలలు పట్టుకోవాల్సి వస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy