ఇక విద్యార్థి ఉద్యమనేతలే టీఆర్ఎస్ లో కీలక పాత్ర పోషించనున్నారా?

తెలంగాణ రాజకీయాల్లో రోజురోజుకు కీలకపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.మునుపెన్నడూ చూడని రాజకీయం తెలంగాణలో కనిపించే పరిస్థితి కనిపిస్తోంది.

ఎందుకంటే బీజేపీ అనేది తెలంగాణలో కాస్త పుంజుకోవడంతో ఇక అమిత్ షా లాంటి నేతలు వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఇప్పటికే క్యాడర్ కు దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే.అయితే టీఆర్ఎస్ పార్టీ పరంగా ఈ సారి ఎన్నికల్లో విద్యార్థి ఉద్యమ నాయకులే కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది.

ఎందుకంటే గత రెండు దఫా ఎన్నికలలో కెసీఆర్ ఒక్కడై నడిపించగా ఈసారి ఇక మరో సారి ఉద్యమం లాంటి వాతావరణాన్ని కెసీఆర్ సృష్టించనున్నట్లు పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి.ఎందుకంటే బీజేపీ పెద్ద ఎత్తున రెచ్చిపోయే పరిస్థితి ఉన్న తరుణంలో అందుకు తగ్గట్టుగా టీఆర్ఎస్ కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

అయితే కెసీఆర్ ఎటువంటి వ్యూహం వేసినా అందులో ఏదో ఒక మతలబు ఉంటుందనే విషయం తెలిసిందే.

Will The Student Movement Itself Play A Key Role In The Trs, Trs, Cm Kcr, Telan
Advertisement
Will The Student Movement Itself Play A Key Role In The TRS?, TRS, CM KCR, Telan

అయితే ముచ్చటగా మూడో సారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కెసీఆర్ కృత నిశ్చయంతో ఉండగా అభివృద్ది ఫలాలు ప్రజలకు అందించడం ద్వారా ప్రజల్లో టీఆర్ఎస్ అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి ఇక సరికొత్త ఎన్నికల మ్యానిఫెస్టో ద్వారా ప్రజల దృష్టి టీఆర్ఎస్ వైపు మళ్లేలా ఉండనున్న టీఆర్ఎస్ వ్యూహం ఎంత మేరకు విజయం సాధిస్తుందనేది ఇప్పుడే మనం ప్రస్ఫుటంగా ఖచ్చితంగా చెప్పలేకపోయినా రానున్న రోజుల్లో మాత్రమే మనకు తెలిసే అవకాశం కనిపిస్తోంది.ఎందుకంటే బీజేపీ, కాంగ్రెస్ నుండి  వస్తున్న విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టి ప్రజలను మెప్పించగలగాలి.అయితే కెసీఆర్ కు ఇది అంతగా కష్టతరమైన విషయం కాకున్నా ఎన్నికల సరళిని చూసే వారికి కెసీఆర్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారనే ఆసక్తి మాత్రం ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు .

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు