కేటీఆర్ వల్లే బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందా..?

తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టంగా మారిపోయింది.ఎన్నికలకు పట్టుమని పది రోజులు కూడా లేవు.

ఇక పార్టీలోకి ఎంతమంది వస్తున్నారో అంత మంది పార్టీని వదిలి ఇతర పార్టీలలోకి జంప్ అవుతున్నారు.ఇక ఎప్పటినుండో కేసీఆర్ (KCR) తో సన్నిహితంగా ఉన్న చాలామంది నేతలు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్లోకి,బీజేపీ లోకి వెళ్లారు.

అలాంటి వారిలో తుమ్మల నాగేశ్వరరావు,ఈటెల రాజేందర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు.అయితే వీరు పార్టీని వదిలి వెళ్లిపోవడంతో పార్టీ గ్రాఫ్ కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు.

ఇక బిఆర్ఎస్ గ్రాఫ్ పడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.దానికి ప్రధాన కారణం తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar rao) రీసెంట్గా మాట్లాడిన ఓ ఇంటర్వ్యూలోని మాటలే.

Advertisement

మరి ఇంతకీ తుమ్మల నాగేశ్వరరావు ఏం మాట్లాడారంటే.తుమ్మల నాగేశ్వరరావు రీసెంట్గా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.

నాకు కేసీఆర్ తో 40 ఏళ్ల సాన్నిహిత్యం ఉంది.నేను ఖాళీగా ఉన్న సమయంలో నాకు కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు.

అలాగే కేసీఆర్ ఖాళీగా ఉన్న సమయంలో నేను ఆయనకు మంత్రిపదవి ఇప్పించాను.మా మధ్య ఎలాంటి గొడవలు కూడా లేవు.

ఇప్పటికి కూడా నాకు కేసీఆర్ పై మంచి ఉద్దేశమే ఉంది.

ఎన్టీఆర్ నాకన్నా చిన్నోడు... నన్ను మాత్రం ఒరేయ్ అని పిలుస్తాడు : రాజీవ్ కనకాల 
జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?

ఇక నేను పార్టీ వీడడానికి సొంత పార్టీ నేతలే కారణం.అలాగే నేను గత ఎన్నికల్లో 300 ఓట్ల తేడాతో ఓడిపోవడానికి కారణం కూడా సొంత పార్టీ నేతలే.ఇక ఈ ఎన్నికల్లో కూడా నాకు కేసీఆర్ టికెట్ ( BRS Ticket ) ఇస్తాననే ఉద్దేశంతోనే ఉన్నారు.

Advertisement

కానీ ఇతరులు ఆయనను ఒత్తిడి చేయడం వల్ల ఆయన నాకు టికెట్ ఇవ్వలేదు.కానీ వారు ఒత్తిడి చేయకపోతే కచ్చితంగా నాకు కేసీఆర్ టికెట్ ఇచ్చేవారు అలాగే కేసీఆర్ ని ఒత్తిడి చేసింది ఎవరో కాదు కుటుంబ సభ్యులే అంటూ కూడా తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకు రావడం గమనార్హం.

అయితే కుటుంబ సభ్యులు అంటే ప్రధానంగా వచ్చేది కేటీఆర్, హరీష్ రావు(Harish Rao) , కవిత మాత్రమే.ఇక ఖమ్మం రాజకీయాల్లో కవిత, హరీష్ రావు అస్సలు వేలు పెట్టారు.

ఇక కేటీఆర్ (KTR) మాత్రమే ఖమ్మం రాజకీయాల్లో వేలు పెడతారు.అంతేకాకుండా తండ్రి మాటకి ఎదురు చెప్పే అంత ధైర్యం కవితకు లేదు.అలాగే హరీష్ రావు కూడా ఎదురు చెప్పడు.

ఇక ఈ నేపద్యంలోనే అందరి దృష్టి కేటీఆర్ మీద పడింది.కేటీఆరే ఈయనకు టికెట్ రాకుండా చేశాడని,కేటీఆర్ వల్లే తుమ్మల నాగేశ్వరరావు పార్టీని వీడారు అంటూ కొంతమంది భావిస్తున్నారు.

అంతేకాదు కేటీఆర్ వల్ల సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి మొదలైందని,ఈయన వల్లే బీఆర్ఎస్ (BRS) గ్రాఫ్ పడిపోతుంది అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తాజా వార్తలు