నితిన్ తమ్ముడు సినిమాలో ఆ సీన్ హైలెట్ కానుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు నితిన్.

( Nithin ) ప్రస్తుతం ఈయన వేణు శ్రీరామ్( Venu Sriram ) డైరెక్షన్ లో తమ్ముడు( Thammudu Movie ) అనే సినిమా చేస్తున్నాడు.

ఇక పవన్ కళ్యాణ్ టైటిల్ ను వాడుకుంటూ ఈ సినిమా మీద భారీ అంచనాలను పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ ఒకటి హైలెట్ గా నిలువబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా మీద వేణు శ్రీరామ్ పెట్టిన ఎఫర్ట్ ఏ బాగా పనిచేస్తుందంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని లీకేజీలైతే వస్తున్నాయి.ఇక మొత్తానికైతే ఈ ఇంటర్వెల్ సీన్( Interval Scene ) మొత్తానికి ప్లస్ అయ్యే విధంగా కనిపిస్తుంది అంటూ మరి కొంతమంది కామెంట్లైతే చేస్తున్నారు.మరి నితిన్ హీరోగా ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమాలో స్టోరీ అనేది బాగుంటుందని పలువురు అంచన వేస్తున్నారు.

Advertisement

నితిన్ స్టోరీ బాగా లేకపోతే మాత్రం సినిమాని ఓకే చేయడు. వేణు శ్రీరామ్ కూడా పెద్ద డైరెక్టర్ అయితే కాదు.కానీ ఆయన డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు అంటే స్టోరీ డిమాండ్ చేసి ఉంటుందనే ఉద్దేశ్యం లోనే పలువురు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే ఆయన మొదటి సినిమా నుంచి కూడా దిల్ రాజు( Dil Raju ) కాంపౌండ్ లోనే వర్క్ చేస్తున్నాడు.బయటికి వెళ్లి ఆయన వేరే సినిమా చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆయన దిల్ రాజు బ్యానర్ లోనే సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు.కాబట్టి ఆయన బ్యానర్ లోనే సినిమా చేస్తూ వస్తున్నాడు.

మరి ఈ సినిమా ఇటు నితిన్ కి, అటు వేణు శ్రీరామ్ కి అనుకున్న సక్సెస్ సాధించి పెడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు
Advertisement

తాజా వార్తలు