తెలంగాణ బిజెపిలో పరిస్థితి గందరగోళంగా మారింది.
ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న కొద్దీ నేతల మధ్య సఖ్యత తగ్గిపోవడం, గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం, గతంలో కాంగ్రెస్ మాదిరిగా తెలంగాణ బిజెపి ( BJP party )పరిస్థితి ఇప్పుడు ఉండడం ,ఇవన్నీ ఇబ్బందికరంగా మారాయి.
ఇటీవల కాలంలో పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు చోటుచేసుకున్నాయి.అలా వచ్చి చేరి నేతలు తమకు సరైన ప్రాధాన్యం లేదని, తామే లక్ష్యంగా సీనియర్ నేతలు పనిచేస్తూ, తమను ఇబ్బంది పెడుతున్నారని, అసంతృప్తికి గురై నేరుగా అధిష్టానానికి ఫిర్యాదులు చేసిన ఘటనలు ఎన్నో జరిగాయి.
పాత కొత్త నేతల మధ్య సయోధ్య కుదుచ్చేందుకు అధిష్టానం పెద్దలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తప్పించి ఆస్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
అలాగే ఎన్నికలను ఎదుర్కొనేందుకు అవసరమైన కమిటీలను నియమించాలని భావిస్తున్నారు.ప్రచార కమిటీ, మేనిఫెస్టో కమిటీ, సోషల్ మీడియా కమిటీ, ప్రచార సభలో కమిటీ ఇలా 22 కమిటీలను నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు.పోటీ ఎక్కువగా లేని నియోజకవర్గాల్లో ఎన్నికల్లో పనులను ప్రారంభించుకోవాలని ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు.
ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా( Amith sha ) ఈనెల 29న ఖమ్మంలో భారీ బహిరంగ సభలో పాల్గొనాలని ముందుగా ప్లాన్ చేసుకున్నా , వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో దానిని వాయిదా వేసుకున్నారు.హైదరాబాద్ లో అమిత్ షా సామాజిక వర్గాల ప్రముఖులతో భేటీ కానున్నారు.
పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తారు.ఇటీవల బీజేపీ నేతలు మధ్య సయోధ్య తగ్గిపోవడం, ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకోవడం వంటి వ్యవహారాలు పార్టీకి ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో, ఈ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించి నాయకులకు హిత బోధ చేయబోతున్నారట.
పార్టీ నేతలు అందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చి, బిఆర్ఎస్ కాంగ్రెస్ లను ఢీకొట్టే విధంగా ఏమేం చేయాలి ? ఏ వ్యూహాలతో ముందుకు వెళ్లాలి ? జనాల్లోకి బిజెపిని ఏ విధంగా తీసుకువెళ్లాలి అనే అంశాల పైన చర్చించబోతున్నారట.ఈ సందర్భంగానే అసంతృప్త నేతలను పిలిపించి అమిత్ షా చర్చించనున్నారని, పార్టీ నేతలు అందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చే విధంగా అమిత్ షా ప్రయత్నిస్తారట.ఇటీవలే అమిత్ షా తో బండి సంజయ్ ఢిల్లీలో భేటీ అయ్యారు .తెలంగాణ బిజెపిలో చోటుచేసుకుంటున్న పరిణామాలపైన చర్చించారు.బండి సంజయ్( Bandi Sanjay ) ప్రాధాన్యానికి ఏ లోటు రాకుండా చూసుకుంటామని కీలక హామీని అమిత్ షా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.
అలాగే పూర్తిగా తెలంగాణ బిజెపి ప్రక్షాళన చేసి పార్టీ నాయకులు అందర్నీ ఎన్నికల మూడ్లోకి తీసుకువెళ్లే విధంగా అమిత్ షా హైదరాబాద్ టూర్ ప్లాన్ చేసుకున్నారట.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy