మహేష్‌తో గొడవ.. 'మహర్షి' వేడుకకు సుకుమార్‌ వచ్చేది అనుమానమే

మహేష్‌ బాబు మహర్షి చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను మే 1వ తారీకున భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ చిత్రం మహేష్‌బాబు కెరీర్‌లో 25వ చిత్రం అవ్వడం వల్ల ఇప్పటి వరకు మహేష్‌ బాబుతో సినిమాలు చేసిన ప్రతి ఒక్క దర్శకుడిని ఈ వేడుకలో భాగస్వామ్యులు చేసేందుకకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మహేష్‌బాబుతో బాబీ అనే చిత్రం తెరకెక్కించిన దర్శకుడు శోభన్‌ చనిపోయాడు.ఇక మిగిలిన అందరు కూడా ఉన్నారు.

వారు అంతా కూడా మహేష్‌ బాబు కోసం వచ్చేందుకు సిద్దం అంటారనే నమ్మకం వ్యక్తం అవుతోంది.మహేష్‌ బాబుతో సినిమాలు చేసిన దర్శకులందరితో ఇప్పటికే చర్చలు జరిపారు.

మహేష్‌బాబుతో వర్క్‌ చేసిన సుకుమార్‌ ఈ వేడుకకు వస్తాడా రాడా అనే విషయంలో కాస్త గందరగోళం నెలకొంది.ఎందుకంటే మహేష్‌ బాబు 26వ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహించాల్సి ఉంది.

Advertisement

చాలా రోజుల పాటు మహేష్‌ కోసం సుకుమార్‌ స్క్రిప్ట్‌ రెడీ చేశాడు.అయితే చివరకు మహేష్‌బాబు ఆ స్క్రిప్ట్‌తో తాను సినిమా చేయలేను అంటూ తేల్చి చెప్పాడు.

దాంతో సుకుమార్‌ ఫీల్‌ అయ్యాడని తెలుస్తోంది.సుకుమార్‌ కోపంతో మరో హీరో వద్దకు వెళ్లాడు.

సుకుమార్‌ కూడా తన 26వ చిత్రానికి అనీల్‌ రావిపూడిని ఎంపిక చేసుకున్నాడు.వీరిద్దరి మద్య గొడవ అంటూ పెద్దగా ఏం జరుగకున్నా కూడా మీడియాలో మాత్రం ఈ విషయంలో కాస్త సీరియస్‌గా ప్రచారం జరిగింది.

మహేష్‌బాబు వంటి పెద్ద స్టార్‌ను సుకుమార్‌ కాదంటాడా, ఆయన కోరుకున్న స్క్రిప్ట్‌ను వద్దంటాడా అంటూ సుకుమార్‌పై అభిమానులు విమర్శలు చేశారు.ఆ విషయంలో ఏమైనా మహర్షి సినిమా వేడుకకు సుకుమార్‌ దూరంగా ఉంటాడా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

మీ దంతాలు పసుపు రంగులో అసహ్యంగా కనిపిస్తున్నాయా? ఇలా చేస్తే ముత్యాల్లా మెరుస్తాయి!

అయితే మహేష్‌ బాబుతో ఉన్న సన్నిహిత్యం కారణంగా సుకుమార్‌ ఖచ్చితంగా వస్తాడని సినీ వర్గాల వారు అంటున్నారు.మే 1న ఏంజరుగబోతుందో చూద్దాం.

Advertisement

తాజా వార్తలు