IPL 2024 PBKS vs DC : పంజాబ్ టీమ్ లో ఈ ఇద్దరు ప్లేయర్లే టీమ్ బాధ్యతలను మోయబోతున్నరా..?

ఐపీఎల్ సీజన్ 17 లో( IPL 17 ) ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లు అయితే ముగిశాయి.

ఇక నిన్న జరిగిన చెన్నై బెంగళూరు మ్యాచ్ లో చెన్నై టీం బెంగుళూరు ను చిత్తు చేసి మంచి విజయం సాధించగా, ఇవాళ్ళ పంజాబ్ ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ టీం ఢిల్లీని చిత్తు చేసి మరి భారీ విజయాన్ని సాధించింది.

ఇక పంజాబ్ టీం ని( Punjab Team ) ముందుండి గెలిపించడంలో ఇద్దరు ప్లేయర్లు కీలకపాత్ర వహించారు.ఇక సామ్ కరణ్,( Sam Curran ) లివింగ్ స్టన్( Livingstone ) అండర్ లోనే పంజాబ్ టీం భారీ విజయాన్ని అయితే సాధించింది.

ఈ మ్యాచ్ లోనే కాకుండా జరగబోయే మ్యాచ్ లో కూడా పంజాబ్ ని విజయతీరాలకు చేర్చాలంటే వీళ్లిద్దరితోనే సాధ్యమవుతుందని చాలామంది అభిమానులు అలాగే సీనియర్ ప్లేయర్లు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ముఖ్యంగా సామ్ కరణ్ ఆడిన స్పెల్ అయితే అద్భుతమనే చెప్పాలి.వరుసగా వికెట్లను కోల్పోయిన సమయంలో తను క్రీజు లోకి వచ్చి వికెట్లు పడకుండా ఆపుతూనే మరోపక్క టీం స్కోర్ ని చక్కదిద్దేపనిలో పడ్డాడు.ఇక మొత్తానికైతే 47 బంతులు 63 పరుగులు చేసిన సామ్ కరణ్ పంజాబ్ టీం గెలుపులో కీలకపాత్ర వహించాడు.

Advertisement

ఇక చివరిలో లివింగ్ స్టన్ కూడా తనదైన రీతిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో మొదటి విక్టరీని సాధించింది.ఇక అదే విధంగా గెలుపు బాగుటాని ఎగరవేస్తే పంజాబ్ తప్పకుండా ఈసారి సెమీఫైనల్ కి చేరుకుంటుందంటూ పలువురు క్రికెట్ అభిమానులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇక లివింగ్ స్టన్ కూడా 21 బంతుల్లో 3 సిక్స్ లు, 2 ఫోర్లతో 38 పరుగులు చేసి భారీ విక్టరీని నమోదు చేశాడు.

ఇక సామ్ కరణ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

Advertisement

తాజా వార్తలు