రేవంత్ గురి పెడతారా ? వదిలేస్తారా ?

తెలంగాణ రాష్ట్ర రెండో ముఖమంత్రిగా బాద్యతలు చేపట్టబోతున్న రేవంత్ రెడ్డి( Revanth reddy )మాజీ సి‌ఎం కే‌సి‌ఆర్ విషయంలో ఎలాంటి వైఖరితో ఉండబోతున్నారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారిన అంశం.

ఎలాంటి రాజకీయ బ్యాక్ గ్రాండ్ లేకుండా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో పదవిని అధిష్టించబోతున్నారు.

అయితే తన రాజకీయ జీవితానికి మాయని మచ్చలా ఉన్న వెలితి ఏదైనా ఉందా అంటే అది ఓటుకు నోటు కేసే అని చెప్పవచ్చు.ఆయన జైలుకు వెళ్ళే సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ పై నిప్పులు చెరిగారు.

Will Revanth Reddy Target Kcr , Kaleshwaram , Kcr , Revanth Reddy , Ts Politics

అంతు చూస్తా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు.దీంతో ప్రస్తుతం ఇప్పుడు రేవంత్ రెడ్డి సి‌ఎం కావడంతో కే‌సి‌ఆర్( KCR ) పై ప్రతీకారం తీర్చుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.కాగా ఎన్నికల ముందు కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై గట్టిగానే విమర్శలు, ఆరోపణలు గుప్పించారు రేవంత్ రెడ్డి.

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వేల కోట్ల అవినీతి జరిగిందని, ధరణిలో భూ కబ్జాలకు పాల్పడ్డారని.అధికారంలోకి వచ్చిన తరువాత వాటిపై ఎంక్వైరీ వేయిస్తామని, కే‌సి‌ఆర్ ను జైలుకు పంపిస్తామని ఇలా గట్టిగానే కే‌సి‌ఆర్ వైపు గురి పెడుతూ వచ్చారు.

Advertisement
Will Revanth Reddy Target KCR , Kaleshwaram , KCR , Revanth Reddy , Ts Politics

దీంతో కే‌సి‌ఆర్ టార్గెట్ గా రేవంత్ రెడ్డి ఇలా ముందుకెళ్తారనేది ఆసక్తిరేపుతున్న అంశం.

Will Revanth Reddy Target Kcr , Kaleshwaram , Kcr , Revanth Reddy , Ts Politics

అయితే తాను కక్షపూరిత రాజకీయాలు  చేయనని చట్టప్రకారమే ముందుకెళ్తానని ఆ మద్య ఓ టీవి ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి విధితమే.దీంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి కే‌సి‌ఆర్ పై చేసిన ఆరోపణల విషయంలో ఎలా వ్యవహరించబోతున్నారో ఆసక్తికరంగా మారుతున్న అంశం.ఇకపోతే ప్రస్తుతం ఆరు గ్యారెంటీ హామీలపై రేవంత్ రెడ్డి దృష్టి సారించే అవకాశం ఉంది.

ఆ తరువాత గత ప్రభుత్వంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్ట్, ధరణి వంటివాటిలో జరిగిన అవినీతిపై రేవంత్ రెడ్డి ఫోకస్ చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.మరి ఏం జరుగుతుందో చూడాలి.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal
Advertisement

తాజా వార్తలు