రాజు గారి ' సీటు' కాకినాడకు మారనుందా ?

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే.

వైసీపీ నుంచి ఎంపీ గా గెలిచిన తరువాత కొంతకాలం పాటు ఆ పార్టీలో సఖ్యత గానే మెలిగినా,  రఘురామ తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని , జగన్ ను కలిసేందుకు కొంతమంది వైసిపి కీలక నేతలే అడ్డం పడుతున్నారని,  జగన్ కు తనకు మధ్య గ్యాప్ పెరగడానికి వారే కారణం అంటూ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన దగ్గర నుంచి పూర్తిగా ఆయన వైసీపీకి శత్రువుగా మారిపోయారు.

ఏపీ ప్రభుత్వాన్ని, జగన్ ను ఇరుకున పెట్టే విధంగా రఘురామ తరచుగా విమర్శలు చేస్తుండడం వంటివి సర్వసాధారణంగా మారిపోయాయి.ఈ క్రమంలో ఆయన వైసీపీకి రాజీనామా చేయకపోయినా,  పూర్తిగా దూరం అయిపోయారు.

దీంతో రాబోయే ఎన్నికల్లో రఘురామ ఏ పార్టీలో చేరుతారు ? ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.         అయితే ఆయన వైసీపీకి దూరమైన దగ్గర నుంచి టిడిపి విషయంలో సానుకూలంగా ఉంటుండడం,  రఘురామకు అనేక విధాలుగా టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు,  ఆ పార్టీ నాయకులు మద్దతు పలుకుతూ ఉండడం తదితర కారణాలతో రాబోయే ఎన్నికల్లో టిడిపిలో రఘురామ చేరబోతున్నట్టు సమాచారం.

ఈ క్రమంలో రఘురామ కృష్ణంరాజు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.అయితే ఆయన కు కాకినాడ ఎంపీ టికెట్ ఇచ్చే ఆలోచనలో చంద్రబాబు ఉండడంతో పాటు, ఇప్పటి నుంచే ఈ నియోజకవర్గంలో పనిచేసుకోవాలని, టికెట్ మీకే కన్ఫర్మ్ చేస్తున్నట్టు బాబు రఘురామ కు సంకేతాలు ఇచ్చారట.     

Advertisement

   అయితే ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం పార్లమెంట్ స్థానంలో 2019 లో ఎంపీ గా టిడిపి తరపున పోటీ చేసి ఓటమి చెందిన వేటుకూరి వెంకట శివ రామరాజు కే టికెట్ కన్ఫర్మ్ చేసే అలోచనతో ఉండడం తో రఘురామ కు కాకినాడ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట.గతంలో క్షత్రియ సామాజిక వర్గానికే చెందిన సినీ నటుడు  కృష్ణం రాజు కాకినాడ నుంచి పోటీ చేసి గెలిచిన నేపథ్యంలో.అదే సామాజిక వర్గానికి చెందిన రఘురామ కు టికెట్ ఇవ్వడం ద్వారా సులువుగా ఈ సీటు ను గెలుచుకోవచ్చు అనే లెక్కల్లో బాబు ఉన్నారట.

జనసేన,  టీడీపీ పొత్తు కుదిరినా.కాకినాడ సీటు మాత్రం రఘురామ కే ఇచ్చేందుకు బాబు సిద్ధం అవ్వడం తో రఘురామ ఇప్పటికే అక్కడ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారట.

Advertisement