టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu) తనయుడు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్( Nara Lokesh ) ప్రస్తుతం యువగళం పాదయాత్రతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ పాదయాత్రలో భాగంగా ప్రబుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిస్తూ, టీడీపీకి మైలేజ్ తెచ్చే పనిలో ఉన్నారు.
ఇప్పటివరకు లోకేశ్ పాదయాత్రను మొదట వైసీపీ లైట్ తీసుకున్నప్పటికి.ప్రస్తుతం లోకేశ్ పాదయాత్రను సీరియస్ గానే తీసుకుంటున్నారు.
ఎందుకంటే పాదయాత్రలో భాగంగా జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తూ.ప్రతి నియోజిక వర్గంలోని ఎమ్మెల్యేల అక్రమాలను బయట పెట్టె ప్రయత్నం చేస్తున్నారు దీంతో అందరి దృష్టి లోకేశ్ పాదయాత్రపై పడింది.
ఇక పాదయాత్ర వల్ల లోకేశ్ మాటతీరులో కూడా చాలానే మార్పు కనిపిస్తోంది.ఘాటైన విమర్శలు పదునైన సవాళ్ళు చేస్తూ ప్రత్యర్థి పార్టీ నేతలకు గట్టిగానే సమాధానం ఇస్తున్నారు.దీంతో ఈసారి టీడీపీలో లోకేశ్ ప్రభావం గట్టిగా ఉండబోతుందని తెలుగుతమ్ములు నమ్ముతున్నారు.
ఇదిలా ఉంచితే గత ఎన్నికల్లో మంగలగిరి నుంచి పోటీ చేసిన లోకేశ్ దారుణంగా ఓటమి చవి చూశారు.పార్టీ అద్యక్షుడి తనయుడు.ఓడిపోవడంతో లోకేశ్ పై దారుణంగా ట్రోల్స్ నడిచాయి.
దాంతో వచ్చే ఎన్నికల్లో వేరే స్థానం నుంచి లోకేశ్ బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి.
అయితే తాను ఓడిన చోటే గెలిచి చూపిస్తానని వచ్చే ఎన్నికల్లో కూడా మంగళ గిరి నుంచే పోటీ చేస్తానని గతంలోనే స్పష్టం చేశారు లోకేశ్.ఇక అప్పటినుంచి ఎప్పటికప్పుడు మంగలగిరి ప్రజలకు అందుబాటులో ఉంటూ తనదైనా మార్క్ కనబరుస్తూ వచ్చారు.ప్రస్తుతం మంగలగిరిలో గెలుపు పై లోకేశ్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
అయితే ఈసారి కూడా లోకేశ్ కు మంగళగిరి( Mangalagiri )లో ఓటమి తప్పదు అని వైసీపీ నేతలు చెబుతున్నారు.ఒకవేళ ఈసారి లోకేశ్ మంగళగిరిలో ఓడిపోతే అది ఆయన రాజకీయ జీవితంపై గట్టిగా ప్రభావం చూపే అవకాశం ఉంది.
అయితే గతంతో పోలిస్తే లోకేశ్ ప్రస్తుతం టీడీపీలో క్రియశీలకంగా మారుతున్నారు.దాంతో మంగళగిరిలో లోకేశ్ గెలుపు ఖాయమనే భావనలో టీడీపీ శ్రేణులు( TDP ) ఉన్నారు.మరి ఏం జరుగుతుందో చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy