కాంగ్రెస్ లో అయినా కోదండరాంకు పదవి దొరికేనా..?

ప్రస్తుతం కాంగ్రెస్ ( Congress ) పార్టీ 65 సీట్లతో సంపూర్ణ మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఇదే తరుణంలో పాతాళంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చినటువంటి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు కాంగ్రెస్ అధిష్టానం.

ఇదే తరుణంలో ఆయన డిసెంబర్ 7, 2023న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు.ఇదే తరుణంలో ఆయనతోపాటు ఇంకా 11 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసి వివిధ హోదాలను స్వీకరించారు.

ప్రస్తుతం ఒక ముఖ్యమంత్రి 11 మంది మంత్రులతో ప్రగతిభవన్ ( Pragathi bhavan ) లో మొదటి రోజు పాలన మొదలుపెట్టారు.మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ వెంట ఎంతోమంది మేధావులు తిరుగుతూ సపోర్ట్ అందించారు.

ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కోదండరాం( Kodanda ram ) .మరి అలాంటి కోదండరాంకు కాంగ్రెస్ లో మంచి పదవి ఉండబోతుందని తెలుస్తోంది.మరి ఆ వివరాలు ఏంటో పూర్తిగా చూద్దాం.

Advertisement
Will Kodandaram Get A Position Even In Congress ,Congress, Kodandaram, TSPSC, R

ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ ప్రత్యేక ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారు.కేసీఆర్ ( KCR ) వెన్నంటే ఉంటూ ఎంతో ధైర్యాన్ని అందించారు.

అలా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంలో ముందు వరుసలో ఉన్నారని చెప్పవచ్చు.రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ సీఎం అయిన తర్వాత కోదండరాంను వదిలేసారు కేసీఆర్.

ఎవరో తెలియని వ్యక్తిలా ఆయనను పూర్తిగా పక్కకు నెట్టేశారు.దీంతో విసుగు చెందిన కోదండరాం టీజేఎస్ ( TJS ) పార్టీ పెట్టి కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేశారు.

Will Kodandaram Get A Position Even In Congress ,congress, Kodandaram, Tspsc, R

ఆయన చేస్తున్న అక్రమాల గురించి ఎంతోమంది ప్రజలకు వివరిస్తూ సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు.ఇక రేవంత్ రెడ్డి ( Revanth reddy ) తో జతకట్టి కాంగ్రెస్ పార్టీలో టీజేఎస్ పార్టీని విలీనం చేసి , రేవంత్ వెంటే ఉంటూ, కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను చెబుతూ, నిరుద్యోగ యువకులకు అండగా ఉంటామని ధైర్యాన్ని కల్పించారు.కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువస్తే తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని టిఎస్ పిఎస్ ని ప్రక్షాళన చేస్తామని హామీ ఇస్తూ వచ్చారు.

Will Kodandaram Get A Position Even In Congress ,congress, Kodandaram, Tspsc, R
అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

నిరుద్యోగుల బాధలపై ప్రత్యేకంగా ప్రతి సభలో మాట్లాడారు కోదండరాం.ఈ విధంగా నిరుద్యోగుల ఓట్లు కాంగ్రెస్ వైపు మల్లేలా చేయడంలో ఆయన ప్రత్యేక చొరవ చూపారని చెప్పవచ్చు.అలాంటి కోదండరాంకు త్వరలో కాంగ్రెస్ అధిష్టానం మంచి పదవి ఇవ్వబోతుందని సమాచారం.

Advertisement

ముఖ్యంగా ఆయన నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వ్యక్తి కాబట్టి టిఎస్పిఎస్సి ( TSPSC ) లో చైర్మన్ గా బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.ఎందుకంటే ఈ పదవి ఆయనకు మాత్రమే సూట్ అవుతుందని కాంగ్రెస్ అధిష్టానం భావించినట్టు సమాచారం.

తాజా వార్తలు