రవితేజ నమ్మకాన్ని ఖిలాడి నిలబెడతాడా?

మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ క్రాక్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుందో అందరికీ తెలిసిందే.

దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది.

ఇక ఈ సినిమా అందించిన బూస్ట్‌తో తన నెక్ట్స్ మూవీని దర్శకుడు రమేశ్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు రవితేజ.‘ఖిలాడి’ అనే టైటిల్‌తో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Will Khiladi Live Upto Raviteja Expectation, Raviteja, Khiladi, Ramesh Varma, Kr

ఈ సినిమాలో రవితేజ డ్యుయెల్ రోల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాతో క్రాక్ అందించిన సక్సెస్‌ను కంటిన్యూ చేయాలని రవితేజ గట్టిగా ప్రయత్ని్స్తున్నాడు.

ఈ సినిమా కథను పూర్తి క్రైమ్ థ్రిల్లర్‌గా దర్శకుడు రమేశ్ వర్మ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.అయితే రొటీన్ చిత్రాలను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోకపోవడంతో, ఈ సినిమా కథలో వైవిధ్యం ఉంటేనే ఈ సినిమా విజయాన్ని అందుకుంటుందని, లేదంటే ఈ సినిమా ఫ్లాప్‌గా మిగలడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.

Advertisement

దీంతో ఈ సినిమాలో ఖచ్చితంగా వైవిధ్యమైన కథ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.రవితేజ కూడా ఈ సినిమాపై మంచి నమ్మకాన్ని పెట్టుకున్నాడు.

ఈ సినిమాతో తన కెరీర్‌లో మరో విజయాన్ని అందుకోవాలని రవితేజ చూస్తున్నాడు.ఇక ఈ సినిమాలో రవితేజ చేసే పాత్రలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయిన చిత్ర యూనిట్ అంటోంది.

ఈ సినిమాలో అందాల భామలు మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగ, ఈ సినిమాను వేసవి కానుకగా మే 28న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

మరి ఖిలాడి చిత్రం రవితేజ నమ్మకాన్ని ఎంతమేర నిలబెడుతుందో చూడాలి.

వృద్ధాప్యాన్ని వాయిదా వేసే అద్భుతమైన పానీయం
Advertisement

తాజా వార్తలు