వైయస్ జగన్మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy )ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత ఎదురైన కాంట్రవర్సీలలో అతిపెద్దది అమరావతి ఇష్యూ .
దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ కూడా జరిగింది .
ముఖ్యంగా ఇక్కడ రాజధాని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో గత తెలుగుదేశం ప్రబుత్వం రైతుల నుంచి భూమి సేకరించి మాస్టర్ ప్లాన్ కూడా రెఢీ అయ్యి కొన్ని నిర్మాణాలు కూడా పూర్తయిన తర్వాత ప్రబుత్వం మారడం తో అదికారం లోకి వచ్చిన జగన్ మూడు రాజధానులు పేరుతో రాజధానిని విశాఖపట్నం( Visakhapatnam ) తరలించాలని శతాదా ప్రయత్నించారు .ఈ విషయం లో ముఖ్యమంత్రి జగన్ చూపిన పట్టుదల, చొరవ కొన్ని వర్గాలకు జగన్ ను దూరం చేసింది.అమరావతి ఉద్యమం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అమరావతి రైతులు పాదయాత్ర చేయటం వైసీపీ నేతలు ఎక్కడకక్కడ వారిని అడ్డుకున్న వివాదాల తో రాజధాని గా అమరావతికి జగన్ వ్యతిరేకమన్న నమ్మకం రాష్ట్రవ్యాప్తంగా స్థిరపడిపోయింది.
జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచిన మొదటి నాలుగు విషయాలలో అమరావతి కూడా ఒకటే అంటే అతిశయోక్తి కాదు అయితే ఈ వ్యతిరేక వాతావరణన్ని మెల్లమెల్లగా తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా జగన్ వ్యవహార శైలి కనిపిస్తుంది.విశాఖ రాజధాని అంశం పై సుప్రీంకోర్టు మోకాలు అడ్డడం , అది ఇప్పట్లో తేలే విషయంలా కనిపించకపోవడంతో అమరావతి ప్రాంతంలోని వ్యతిరేకతను తగ్గించుకుంటూనే వ్యూహాత్మక గా ముందుకు వెళ్లేందుకు జగన్ ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది.ఇప్పటికే అమరావతిలో పేదవారికి ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు అక్కడ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేసింది .ఆ సందర్భంగా వెంకటపాలెం లో ఏర్పాటుచేసిన సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ అమరావతిని ఒక సామాజిక వర్గానికే పరిమితం చేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు( N Chandrababu Naidu ) కుట్రలు పన్నారని, అయితే పేదవారికి పెద్దవారికి జరుగుతున్న పోరాటంలో తాను అండగా తన అక్క చెల్లెమ్మలకు నిలబడి సామాజిక అమరావతికి తొలి అడుగు వేశానని ఆయన చెప్పుకొచ్చారు .ఇకపై అమరావతి మన అందరిదీ అంటూ కొత్త స్లోగన్ కూడా అందుకున్నారు.
దాంతో అమరావతి( Amaravati )పై జగన్ స్టాండ్ మారుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.అయితే ఒకప్పుడు ఒక సామాజిక వర్గానికే పరిమితమైన అమరావతిని తాను వెనకబడిన వర్గాలకు కూడా సముచిత స్థానం కల్పించడం ద్వారా సామాజిక అమరావతి కోసం పాటుపడుతున్నానని, తాను పెత్తందారులకే వ్యతిరేకం తప్ప పేదవారికి కాదన్న సంకేతాలను ఇవ్వడానికి జగన్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది.అయితే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా విశాఖ రాజధాని విషయంలో కథ ముందుకు కదలకపోవటం, ఎన్నికలకు కూడా సమయం దగ్గర పడటంతో అనవసరంగా కొన్ని వర్గాలను దూరం చేసుకుంటున్నాను అన్న సత్యాన్ని గ్రహించడం వల్లే జగన్ ఈ విషయంలో రివర్స్ స్టాండ్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది.
వ్యతిరేకతను సాధ్యమైనంత తగ్గించుకొని అమరావతిలో బలం పెంచుకోవడానికి ఇది ముందడుగుగా వైసిపి వర్గాలు విశ్లేషిస్తున్నాయి .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy