సంక్రాంతి సినిమాలతో దిల్ రాజుకు పూర్వ వైభవం దక్కుతుందా.. ఆ రేంజ్ హిట్లు సాధిస్తాడా?

ఇటీవల కాలంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి ( Producer Dil Raju )వరుసగా అన్ని ఆటుపోట్లు ఎదురవుతున్న విషయం తెలిసిందే.

ఆయన నిర్మాతగా వ్యవహరించిన చాలా సినిమాలు ఈ మధ్యకాలంలో విడుదల అయ్యి ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్ట లేకపోయాయి.

ఫలితంగా నిర్మాత దిల్ రాజుకి భారీగా నష్టాలు మిగిలాయి.ముఖ్యంగా వకీల్ సాబ్,బలగం,ఫ్యామిలీ స్టార్ ( Vakil Saab, Balagam, Family Star )వంటి సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.

ఈ సినిమాలలో కొన్ని సక్సెస్ ను సాధించినప్పటికీ ఆశించిన స్థాయిలో పలితాలను రాబట్టలేకపోయాయి.

Will Dil Raju Bounce Back With Game Changer, Dil Raju, Game Changer, Tollywood,

ఇదే విషయాన్ని దిల్ రాజు గుర్తు చేసుకున్నారు.ఒక స‌మ‌యంలో త‌న జ‌డ్జిమెంట్ కి ఏమైంద‌న్న బెంగ కూడా వ‌చ్చింద‌ట‌.త‌ప్పుల‌న్నీ స‌రిద్దిద్దుకొని మ‌ళ్లీ ఒక సూప‌ర్ హిట్ తో క‌మ్ బ్యాక్ ఇవ్వాల్సిన ప‌రిస్థితిలో గేమ్ ఛేంజ‌ర్‌ చేశానని ఈ సినిమాతో త‌ప్ప‌కుండా పునః వైభ‌వం వ‌స్తుంద‌ని ఆశ‌ప‌డుతున్నారు దిల్ రాజు.

Advertisement
Will Dil Raju Bounce Back With Game Changer, Dil Raju, Game Changer, Tollywood,

అయితే గేమ్ ఛేంజ‌ర్ విష‌యంలోనూ ముందు నుంచీ నెగిటీవ్ ప్రోప‌కాండ‌నే న‌డుస్తుంద‌న్న విష‌యం ఆయ‌న గుర్తించారు.నిర్మాత‌గా తాను ఫ్లాపుల్లో ఉన్నార‌ని భార‌తీయుడు 2 సినిమాతో( Bharatiyadu 2 movie ) శంక‌ర్ కూడా డౌన్‌ లోనే ఉన్నాడ‌ని, ఒక్క రామ్ చ‌ర‌ణ్ త‌ప్ప తమ ప్రాజెక్టులో పాజిటీవ్ విష‌యాలు లేవ‌ని, పైగా నిర్మాత‌కు శంక‌ర్ ( Shankar )క్రియేటీవ్ స్పేస్ ఇవ్వ‌డ‌న్న సంగ‌తి త‌న‌కు తెలుస‌ని, అయినా స‌రే ఈ సినిమాని హిట్ చేయాల‌న్న త‌ప‌న‌తో శంక‌ర్‌ తో క‌లిసి ప‌ని చేశాన‌ని గుర్తు చేసుకొన్నారు దిల్ రాజు.

Will Dil Raju Bounce Back With Game Changer, Dil Raju, Game Changer, Tollywood,

మరి రామ్ చరణ్ సినిమా( Ram Charan movie ) విడుదల అయి మంచి సక్సెస్ అవుతుందా? నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలను తెచ్చి పెడుతుందా? దిల్ రాజుకు మళ్ళీ పూర్వ వైభవం దక్కుతుందా అన్న విషయాలు తెలియాలి అంటే ఈ నెల 10 వరకు వేచి చూడాల్సిందే మరి.ఈ సినిమా కోసం రాంచరణ్ అభిమానులతో పాటు పాన్ ఇండియా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు