కాంగ్రెస్ మళ్ళీ అదే తప్పు చేస్తూ లేని చిక్కులను కొని తెచ్చుకుంటుంది.
ప్రస్తుతం కర్నాటక ఎన్నికల వేల బీజేపీ మరియు కాంగ్రెస్( BJP, Congress ) మద్య హోరాహోరీ పోరు నెలకొంది.
అధికారంలో ఉన్న బీజేపీ పై పైచేయి సాధించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ కు అధికారం దక్కనిచ్చే ప్రసక్తే లేదని బీజేపీ వ్యూహాలు పన్నుతోంది.కాగా ప్రస్తుతం రాజకీయ పరిణామాలు చేస్తే బీజేపీ కంటే కాంగ్రెస్ కే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు చూస్తున్న బీజేపీకి.దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లుగా అవకాశం ఇచ్చింది.
కాంగ్రెస్ పార్టీ అప్పుడెప్పుడో రాహుల్ గాంధీ మోడి( Rahul Gandhi, Modi ) పై చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు బయటపెట్టి రాహుల్ గాంధీని కోలుకోలేని దెబ్బ తీసింది బీజేపీ పార్టీ.ఏకంగా రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వానికే రాజీనామా చేయాల్సి వచ్చింది.ఇప్పుడు సేమ్ అలాంటి పరిస్థితి కర్నాటక కాంగ్రెస్ కొని తెచ్చుకునేలా కనిపిస్తోంది.
ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దిరామయ్య( Senior Congress leader Siddiramaiah ) ఆ రాష్ట్రంలోని అధిక శాతం ఉన్న లింగాయత్ కులంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.దీంతో బీజేపీ లీగల్ చర్యలకు సిద్దమైంది.
సిద్దిరామయ్య చేసిన వ్యాఖ్యలకు గాను బీజేపీ నేతలు ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
పరువు నష్టం దావా కింద మేజిస్ట్రీట్ కోర్టులో కేసు కూడా వేశారు.దీంతో ప్రస్తుతం కర్నాటకలో ఇదే హాట్ టాపిక్ అయింది.ప్రస్తుతం ఆ రాష్ట్రంలో బీజేపీతో పోల్చితే కాంగ్రెస్ పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ వివాదం ఆ పార్టీని చుట్టుముడితే ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
కర్నాటకలో లింగాయత్( Lingayat ) ల ఓటు శాతం ఎక్కువ.ఈ నేపథ్యంలో వారంతా కూడా కాంగ్రెస్ కు విరుద్దంగా మారే అవకాశం ఉంది.దీనినే బీజేపీ ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది.
మరి సిద్దిరామయ్య లింగాయత్ లను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఒకవేళ ఈ వివాదం పెద్దదైతే కాంగ్రెస్ కు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
మరి హస్తం పార్టీ ఏం చేస్తుందో చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy