ఎల్2 ఎంపురాన్ సినిమాను చిరంజీవి రీమేక్ చేస్తారా.. ఇక్కడ క్లారిటీ వచ్చేసిందిగా!

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవికి సెకండ్ ఇన్నింగ్స్ లో మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి.

చిరంజీవి నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తుండగా మరికొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించడం లేదు.

అయితే లూసిఫర్ సినిమాను చిరంజీవి తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.

అయితే లూసిఫర్ సీక్వెల్ ఎల్2 ఎంపురాన్ పేరుతో తెరకెక్కుతుండగా ఈ సినిమాను కూడా చిరంజీవి రీమేక్ చేస్తారా అనే ప్రశ్నకు కాదనే సమాధానం వినిపిస్తోంది.వాస్తవానికి లూసిఫర్ స్క్రిప్ట్ కు ఎన్నో మార్పులు చేసి గాడ్ ఫాదర్ సినిమాను తెరకెక్కించారు.

ఎల్2 ఎంపురాన్(L2 Empuran) సినిమాలో ఉన్న కొన్ని మెయిన్ పాత్రలు గాడ్ ఫాదర్ లో లేవు.అందువల్ల ఈ సినిమా రీమేక్ అయ్యే ఛాన్స్ అయితే లేదు.

Will Chiranjeevi Remake L2 Empuran Movie Details Inside Goes Viral In Social Med
Advertisement
Will Chiranjeevi Remake L2 Empuran Movie Details Inside Goes Viral In Social Med

మరోవైపు ప్రస్తుతం ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుండటం గమనార్హం.అందువల్ల కూడా రీమేక్ సినిమాలకు కూడా గతంలోలా డిమాండ్ లేదనే సంగతి తెలిసిందే.చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఉగాది కానుకగా చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో మూవీ మొదలు కానుంది.ఉగాది పండుగ రోజున ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారికంగా అప్ డేట్స్ అయితే రానున్నాయని తెలుస్తోంది.

చిరంజీవి రెమ్యునరేషన్ 70 నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.చిరంజీవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

రాజమౌళి మహేష్ బాబు సినిమాలో లేడీ విలన్...
Advertisement

తాజా వార్తలు