బీజేపీ త్రిముఖ వ్యూహం.. ఫలిస్తుందా ?

తెలంగాణ బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి.

అధ్యక్ష పదవిపై గందరగోళం, నేతల మద్య అంతర్గత కుమ్ములాటలు, ప్రదాన్యత లేని నేతల్లో అసమ్మతి సెగలు.

ఇలా చాలా సమస్యలే తెలంగాణ బీజేపీని చుట్టుముట్టాయి.దీంతో ఎన్నికల ముందు వీటన్నిటిని ఎలా పరిష్కరించాలనే దానిపై బీజేపీ అధిష్టానం( BJP ) మల్లగుల్లాలు పడుతున్నట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం పార్టీలో ఏర్పడిన ముసలం తగ్గించాలంటే.ప్రక్షాళన ఒక్కటే మార్గం అని హైకమాండ్ ఓ అంచనకు వచ్చిందట.

ముఖ్యంగా ముగ్గురి విషయంలో బీజేపీ అధిష్టానం త్రిముఖ వ్యూహాన్ని అమలు చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.గత కొన్నాళ్లుగా బండి సంజయ్( Bandi Sanjay ) అధ్యక్ష పదవి మార్పుపై తరచూ వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

పార్టీలో చాలమంది నేతలు కూడా బండి నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారట.అందువల్ల బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించేందుకు బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుందట.అయితే తెలంగాణలో ఎంతోకొంత బీజేపీ బలపడడానికి కారణం బండి సంజయ్ నాయకత్వమే కరణమనేది కొందరి అభిప్రాయం.

అందువల్ల అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తప్పిస్తే కొందరి నుంచి వ్యతిరేకత వచ్చిన ఆశ్చర్యం లేదు.అందువల్ల ఎలాంటి విభేదాలకు తావు లేకుండా బండి సంజయ్ కి కేంద్ర మంత్రి బాద్యతలు అప్పటించి.

రాష్ట్ర పార్టీ అధ్యక్ష హోదాలో కిషన్ రెడ్డిని( Kishan Reddy ) నియమిస్తే ఎలా ఉనుందనే ఆలోచన కూడా అధిష్టానం మదిలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ప్రస్తుతం బీజేపీని కలవర పెడుతున్న మరో కీలక నేత ఈటెల రాజేంద్ర.( Etela Rajender ) సీనియర్ రాజకీయ నాయకుడిగా బి‌ఆర్‌ఎస్ ( అప్పటి టి‌ఆర్‌ఎస్ ) లో కీలక పాత్ర పోషించారు.అలాంటి ఈటెలకు సరైన ప్రదాన్యం లేదనే వాదన ఎప్పటి నుంచో వినిపిస్తోంది.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

ఇదే కారణంతో ఆయన బీజేపీని వీడే ఛాన్స్ కూడా ఉందనే వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి.ఒకవేళ ఈటెల పార్టీ విడితే బీజేపీకి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది.

Advertisement

అందుకే ఈటెలకు తగిన ప్రదాన్యం ఇచ్చే దిశగా బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మెన్ బాధ్యతలు అప్పగించేందుకు బీజేపీ ప్రణాళికలు వేస్తోందట.ఇలా ఇలా పార్టీలోని లొసుగులు తొలగించేందుకు ముగ్గురు కీలక నేతల విషయంలో కమలం హైమాకమాండ్ త్రిముఖ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

తాజా వార్తలు