తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టాలని బీజేపీ( BJP ) కంటున్న కలలు అన్నీ ఇన్ని కావు.
గత లో ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో కమలం పార్టీ దూకుడుగా వ్యవహరిస్తూ వస్తోంది.
జిహెచ్‌ఎంసి ఎన్నికలు మొదలుకొని మునుగోడు బైపోల్ వరకు బిఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే విధంగా కమలనాథులు వ్యవహరిస్తూ వచ్చారు.కానీ అనూహ్యంగా కర్నాటక ఎన్నికల్లో ఓటమి తరువాత తెలంగాణలో కూడా డీలా పడింది కాషాయ పార్టీ.
ఇంతలోనే పార్టీలో నేతల మద్య విభేదాలు బయట పడడం,.పార్టీ కూడా బలహీన పడుతూ రావడం జరిగింది.
ముఖ్యంగా గత బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చుట్టూ రకరకాల విమర్శలు తెరపైకి రావడంతో ఆయనను పదవినుంచి తప్పించింది అధిష్టానం.
ఆయన స్థానంలో కేంద్రమంత్రిగా పని చేసిన కిషన్ రెడ్డి( Kishan reddy )కి ఆ బాద్యతలు అప్పగించింది.తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ప్రమాణస్వీకారం కూడా చేశారు.కాగా అధ్యక్ష పదవి చేపట్టిన కిషన్ రెడ్డి ముందు చాలానే సవాళ్ళు న్నాయి.
ముందు పార్టీలోని అంతర్గత విభేదాలకు చెక్ పెట్టాల్సి ఉంటుంది.బండి సంజయ్, ఈటెల రాజేందర్, రఘునందన్ వంటి వారిని ఒకే తాటిపైకి తీసుకురావాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి పై ఉంది.
పార్టీ కోసం అందరం కలిసికట్టుగా పని చేస్తామని పైపైకి చెబుతున్నప్పటికి లోపల మాత్రం ఎడమొఖం పెడమొఖం గానే ఉంటున్నారు.
గతంలో రెండు సార్లు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కిషన్ రెడ్డికి ఉండడంతో పార్టీ స్థితిగతులను పక్కాగా అంచనా వేసే అవకాశం ఉంది.అలాగే ప్రస్తుతం బిఆర్‌ఎస్ తరువాతి స్థానం కోసం కాంగ్రెస్ గట్టిగా పోటీ పడుతోంది.ఈ నేపథ్యంలో హస్తం పార్టీని వెనక్కి నెట్టి ప్రజల దృష్టి బీజేపీ పై పడేలా చేయాల్సి ఉంటుంది.
గతంలో ఏ మాత్రం బలంలేని బీజేపీని బండి సంజయ్( Bandi Sanjay ) కొంత మెరుగైన స్థితిలో నిలిపారనే చెప్పాలి.మరి ఇప్పుడు కిషన్ రెడ్డి తన పార్టీ బలోపేతం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకొనున్నారు? ఎలాంటి వ్యూహాలను అమలు చేయనున్నారనేది చూడాలి.ఎన్నికలకు కేవలం ఐదు నెలలు మాత్రమే సమయం ఉండడంతో ఈ ఐదు నెలల్లో కిషన్ రెడ్డి నాయకత్వం బీజేపీని ఎంతవరకు గాడిన పెడుతుందో చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy