స్పిరిట్ సినిమాలో ఇంటర్వెల్ సీన్ కోసం అన్ని కోట్లు ఖర్చు అవ్వనుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కి సూపర్ సక్సెస్ లను అందుకున్న డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగ ( Sandeep Reddy Vanga )ఒకరు.

ఈయన చేసిన అనిమల్ సినిమా భారీ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న స్పిరిట్ సినిమా మీద ఇప్పుడు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.మరి దానికి తగ్గట్టుగానే సందీప్ రెడ్డి వంగ కూడా స్పిరిట్ సినిమా కథని చాలా పకడ్బందీగా రాసుకున్నాడు.

Will All The Crores Be Spent For The Interval Scene In Spirit Movie ,sandeep Re

ఇంకా ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్( Prabhas ) అండర్ కవర్ కాపుగా కనిపించబోతున్నాడనే సమాచారం కూడా అందుతుంది.ఇక సందీప్ రెడ్డివంగా ఈ సినిమాతో పక్కాగా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కొట్టి ప్రభాస్ కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాగా మలిచే ప్రయత్నంలో ఉన్నాడు.ఇక ఇప్పటి వరకు ప్రభాస్ కెరియర్ లో బాహుబలి సిరీస్ ది బెస్ట్ సినిమాగా గుర్తుండిపోయింది.

కానీ దానికి మించి ఈ సినిమా ఉండాలని ఆయన ప్రణాళికలు చేసుకుంటున్నాడు.ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో తనదైన రీతిలో ప్రణాళికలను రూపొందించుకొని మొత్తానికైతే తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

Will All The Crores Be Spent For The Interval Scene In Spirit Movie ,sandeep Re
Advertisement
Will All The Crores Be Spent For The Interval Scene In Spirit Movie ,Sandeep Re

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు.ఇక ఇందులో బోల్డ్ సీన్స్ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.మరి ప్రభాస్ వాటిలో నటిస్తాడా లేదంటే ఇబ్బంది పడతాడా అనేది తెలియాల్సి ఉంది.

ఇక మేజర్ గా ఈ సినిమాలోని ఇంటర్ వెల్ సీను తెరకెక్కించడానికి దాదాపు పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని రీసెంట్ గా సందీప్ రెడ్డివంగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం.ఆ సీన్ ను భారీ ఎత్తున తెరకెక్కిస్తారని ఆ సినిమా మొత్తానికి అదే హైలెట్ గా నిలవబోతుంది అనేది కూడా తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు