విస్తృతంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు

తెలంగాణలో త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తోంది.ఇందులో భాగంగా పార్టీ అధిష్టానం పలు నిర్ణయాలు తీసుకుంది.

ఈనెల 25న నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సమావేశాలు నిర్వహించనున్నారు.ఈనెల 27న తెలంగాణభవన్ లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది.

అదేవిధంగా 27న కేసీఆర్ అధ్యక్షతన పార్టీ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయనున్నారు.ఈ సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలకు ఆమోదం తెలపనున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే మే నెలాఖరు వరకు ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగించాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.అనంతరం కంటోన్మెంట్, గోషామహల్, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జ్ లను నియమించారు కేసీఆర్.

Advertisement

ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్ గా మర్రి రాజశేఖర్ రెడ్డి, గోషామహల్ నియోజకవర్గ ఇంఛార్జ్ గా నందకిశోర్ వ్యాస్ బిలాల్ ను, భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఎంపీ మాలోతు కవితను నియమించారు.

కాఫీ, టీ తాగే ముందు మంచినీళ్లు తాగితే మంచిదా..కాదా?
Advertisement

తాజా వార్తలు