రాములమ్మ కు పొగ పెడుతున్న భాజాపా ?

పొలిటికల్ గ్రామర్ తో పాటు సినీ గ్లామర్ పుష్కలం గా ఉన్న అభ్యర్థుల కోసం సాదరణం గా పార్టీలు క్యూ కడుతుంటాయి.

అయితే తెలంగాణలో మాత్రం భాజపా ఒక అభ్యర్థి పట్ల ఉదాసీనం గా వ్యవహరిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఆమె ఎవరో కాదు సినిమాలలో లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి ( Vijayashanti )ఆమె గత కొంతకాలంగా భాజపాలో ఓకింత అసంతృప్తి గా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది.పార్టీలో తనకు దక్కుతున్న ప్రాధాన్యత పట్ల ఆమె సంతృప్తి గా లేరని, తనకు ఎటువంటి కీలకమైన పదవులు ఇవ్వకపోవడం పట్ల ఆమె బిజెపి అధిష్టానం పై ఆగ్రహంగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది.

అంతేకాకుండా ఆమె కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరికను కూడా తీవ్రం గా వ్యతిరేకించారు.

Why Vijayashanti Not In List Of Bjp Star Campaignar ,vijayashanti, Bjp, Kiran K

ఆ తదుపరి పరిణామాలతో గత కొంతకాలంగా భాజపా తో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారామే .త్వరలోనే కాంగ్రెస్లో చేరతారని ,మెదక్( Medak ) నుంచి ఎంపీగా పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది .మరి ఏమైందో ఏమో కానీ తెలంగాణా ఎన్నిక ల ప్రచార స్టార్ క్యాంపెనర్ల జాబితాలో ఆమె పేరు లేకపోవడం రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరిచింది.ఈ జాబితాలో ప్రధాని మోడీ మొదలుకొని నిన్న మొన్న పార్టీలోకి చేరిన నేతల వరకూ ఉన్నారు.

Advertisement
Why Vijayashanti Not In List Of Bjp Star Campaignar ,Vijayashanti, Bjp, Kiran K

కానీ సినిమాల్లోనూ ,పాలిటిక్స్ లోనూ ఓ స్తాయి గ్లామర్ ఉన్న విజయశాంతిని తప్పించడం వెనుక ఆమె పార్టీ మారుతుంది అన్న సంకేతాలు అధిష్టానానికి ఉండడమే అంటూ వార్తలు వస్తున్నాయి.

Why Vijayashanti Not In List Of Bjp Star Campaignar ,vijayashanti, Bjp, Kiran K

అంతేకాకుండా ఆమెను ఎమ్మెల్యేగా పోటీ చేయమని పార్టీ ఆదేశించిందని, కానీ ఆమె ఆ ఆదేశాలను బేఖాతరు చేసినందున పార్టీ ఆమెపై గుర్రు గా ఉందని అందుకే ఆమెను ప్రచారకర్తల లిస్ట్ నుంచి తొలగించారని తెలుస్తుంది.మరి కొన్ని రోజుల లో ఆమే కాంగ్రెస్ చేరిక పై స్పష్టత వస్తుందని వార్తలు వస్తున్నాయి .మరి రాములమ్మ రాజకీయ ప్రయాణం ఏ పార్టీతో ఉంటుందో మరికొన్ని రోజుల్లో ఒక అంచనాకు రావచ్చు .

Advertisement

తాజా వార్తలు