ఒకటే హిట్టు, రెండోది ఫట్టు... ఈ దర్శకుల గందరగోళం ఏమిటి?

సినిమా అనే రంగుల ప్రపంచంలో ప్రతి ఒక్కరూ విహరించాలని ఆశ పడుతూ ఉంటారు.కానీ ఆ అవకాశం, ఏ ఒక్కరికో గాని దక్కదు.

ఎందుకంటే దీనికి స్కిల్స్, శ్రమతో పాటు కాసింత అదృష్టం కూడా ఉండాలని చెబుతారు.సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు( Kota Srinivasa Rao) గారు లాంటివారే గోరంత అదృష్టం ఉంటే తప్ప, ఇక్కడ నెగ్గుకు రాలేము! అని బాహాటంగానే చెప్పడం జరిగింది.

అవును మరి, తెలుగు సినీ చరిత్రలో మనం ఒక పేజీ కావాలంటే ఎవరో చెప్పినట్లు, రాసిపెట్టి ఉండాలేమో.

అయితే కొంతమందికి అలాంటి బంగారు అవకాశం దక్కినప్పటికీ, చేజేతులారా వారి జీవితాలను వారే నాశనం చేసుకుంటారు.ఇలాంటి ఉదాహరణలు ఎన్నో మనకు కనబడతాయి.ముఖ్యంగా ఇక్కడ దర్శకుల విషయం వచ్చేసరికి, ఎన్నో ఏళ్లు శ్రమిస్తే గాని, సినిమా తీశా అవకాశం రాదు.

Advertisement

మరి అలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటే, మరింత శ్రమించి తమను తాము ప్రూవ్ చేసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది.అయితే ఇక్కడ మొదటి సినిమాతో సూపర్ హిట్స్ అందుకున్న కొంతమంది దర్శకులు, రెండవ సినిమాతో ఇండస్ట్రీలో కనబడకుండా పోయారు.

అలాంటి వారి గురించి మాట్లాడుకుందాం.

ఈ లిస్టులో మొదటివాడు, దర్శకుడు దేవా కట్టా.ఈయన దర్శకత్వం వహించిన ప్రస్థానం సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు.విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఎన్నో అవార్డులను కూడా కొల్లగొట్టింది.

అయితే తరువాత వచ్చిన డైనమైట్ సినిమా ప్లాప్ కావడంతో, దేవా సినిమా కెరియర్ గందరగోళంలో పడింది.ఈ లిస్టులోకే చేరుతాడు మరో దర్శకుడు క్రాంతి మాధవ్.మొదటి సినిమా మళ్ళీ మళ్ళీ రాని రోజు సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఈ దర్శకుడు వరల్డ్ ఫేమస్ లవర్ అనే ప్లాఫ్ సినిమా తీసి ఇప్పుడు ఇండస్ట్రీలోనే కనబడకుండా పోయాడు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

ఇదే కోపకు చెందుతాడు, దర్శకుడు అజయ్ భూపతి.ఆర్ ఎక్స్ 100 అనే సినిమాతో హిట్టు కొట్టిన భూపతి సముద్రం అనే ప్లాప్ సినిమా తీసి సైడ్ అయిపోయాడు.

Advertisement

ఇక దర్శకుడు సతీష్ వేగేష్ణ ( Satish Vegesna )గురించి తెలిసే ఉంటుంది.సూపర్ హిట్ శతమానం భవతి సినిమా( Shatamanam Bhavati ) తీసిన దర్శకుడు శ్రీనివాస కళ్యాణం అనే ప్లాప్ సినిమాను తీసి, సినిమా కెరియర్ ని అయోమయ స్థితిలో పడేసుకున్నాడు.

ఇలాంటి దర్శకుల గురించి మీకు ఏమైనా వివరాలు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి.

తాజా వార్తలు