ఆంజనేయుడి జెండా ఇంటిపై ఎందుకు పెడతారో తెలుసా?

సాధారణంగా మనం కొందరి ఇంటిపై ఆంజనేయస్వామి జెండా ఉండడం చూస్తుంటాము.

అయితే ఇలాంటి జెండాలు కేవలం ఆలయం లేదా పూర్వంలో యుద్ధానికి వెళ్ళే సమయంలో రాజులు తమ రథానికి ఇలా జెండా లు పెట్టేవారు.

ఇలా ఆంజనేయస్వామి జెండా పెట్టడం వల్ల యుద్ధంలో విజయం మనదే అవుతుంది.సాధారణంగా ఆంజనేయస్వామిని నమ్మకానికి విజయానికి బలానికి ప్రతీకగా విశ్వసిస్తారు.

అందుకోసమే ఏదైనా శుభకార్యానికి వెళ్లేముందు ఈ జెండా తీసుకు వెళ్లడం వల్ల తప్పకుండా విజయం వరిస్తుందని భావిస్తారు.ఈ క్రమంలోనే పురాణాల ప్రకారం కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి రథాన్ని సాక్షాత్తు శ్రీ కృష్ణుడు నడుపుతాడు రథానికి ఆంజనేయస్వామి జెండా కట్టమని హనుమంతుడు చెప్పడంతో స్వయంగా శ్రీ కృష్ణుడు తన రథానికి జెండా కట్టి కురుక్షేత్ర యుద్ధంలో పోరాడి పాండవులు విజయం పొందారు.

ఇలా పాండవులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ విజయం పొందాలని ఈ జెండాను ఉపయోగిస్తారు.అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది ఇంటి పై భాగంలో ఈ జెండా కట్టి ఉంటారు.

Advertisement

అలా ఇంటి పై భాగంలో ఈ జెండా కట్టి ఉండటానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.

సాధారణంగా ఆంజనేయస్వామి ఎంతో బలవంతుడు కావడంతో ఎలాంటి భూత పిశాచీలనైనా తన కాళ్ళ కింద బంధించి వారిని నాశనం చేస్తాడు.అందుకోసమే ఏ విధమైనటువంటి గాలి, భూత,పిశాచులు మన ఇంటి లోనికి రాకుండా అడ్డుగా ఉండడం కోసం ప్రతి ఒక్కరూ ఇంటికి పైభాగంలో ఆంజనేయస్వామి జెండా కట్టి ఉంటారు.ఇలాంటి జెండా ఇంటి ముందు ఉండటం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ శనిదోషం కానీ లేకుండా ఉండటం కోసం ప్రతి ఒక్కరు ఇంటి పై భాగంలో ఆంజనేయస్వామి జెండా ఉంచుతారు.

Advertisement

తాజా వార్తలు