Prakash raj : ఎందుకు ప్రకాష్ రాజ్ మాత్రమే ఇన్ని సార్లు బ్యాన్ అవుతూ ఉంటాడు..?

ప్రకాష్ రాజ్( Prakash Raj ).మంచి టైమింగ్ తో అద్భుతమైన నటనతో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇవ్వడంలో ప్రకాష్ రాజ్ నీ మించిన వారు లేరు.

ప్రకాష్ రాజ్ కొన్ని నిమిషాల పాటు అయినా సినిమాలో ఉండాలని చాలామంది దర్శక నిర్మాతలు( Director Producers ) కోరుకుంటారు.ఒక్క సీన్ లో నటించిన చాలు అదిరిపోయే పర్ఫామెన్స్ ఇవ్వడం ఆయనకే చెల్లింది.

అయితే ప్రకాష్ రాజ్ చూసే ప్రేక్షకులకు ఒక అద్భుతమైన నటుడే కానీ తీసే నిర్మాతలకు భరించే దర్శకులకు మాత్రమే ఒక పెద్ద బరువుగా మారిపోయారు.ఈ సినిమాలో పెట్టుకోవాలంటే బోలెడన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ఫాలో అవ్వాలి.

లేదంటే ఆయన చేసే నానా గొడవలు భరించాలి.అందుకే దర్శకులు, నిర్మాతలు చాలాసార్లు అధికారికంగా లేదా అనధికారికంగా ప్రకాష్ రాజ్ ని బ్యాన్ చేస్తూనే ఉంటారు.

Why Prakash Raj Getting Banned Many Times
Advertisement
Why Prakash Raj Getting Banned Many Times-Prakash Raj : ఎందుకు ప�

మరి ప్రకాష్ రాజ్ మాత్రమే ఎందుకు ఎక్కువసార్లు బ్యాన్ అవుతున్నారు అంటే ఆయన ఎప్పుడూ కూడా షూటింగ్ కి టైం కి రాడు లేటుగా వచ్చినా సరే రాగానే ఏదో ఒక గొడవ పెట్టుకుంటాడు.డైరెక్టర్ చెప్పిన పనిని కూడా సరిగ్గా చేయడు.కానీ ఒక్కసారి కెమెరా స్విచ్ ఆన్ అయ్యిందంటే చాలు అతనిలో మరో కోణం బయటకు వస్తుంది.

ఆ ఒక విషయం కోసం అతను ఏం చేసినా చాలామంది భరిస్తూ ఉంటారు చివరికి అతను క్లోజ్ ఫ్రెండ్ అయినా కృష్ణవంశీ( Krishna Vamsi ) సైతం చాలాసార్లు వామ్మో ప్రకాష్ రాజ్ ని పెట్టుకుంటే నా పని అయిపోయినట్టే అంటూ దూరం పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Why Prakash Raj Getting Banned Many Times

ఇక మహేష్ బాబు శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆగడు సినిమాలో సైతం మొదట సోను సూద్( Sonu Sood ) స్థానంలో ప్రకాష్ రాజ్ నే పెట్టుకున్నారు.కానీ అతడు చేసిన టార్చర్ ని శ్రీను వైట్ల భరించలేక పోయాడు.దాంతో సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రకాష్ రాజ్ సీన్స్ అన్ని కూడా పీకేసి ఆ స్థానంలో సోనుసూద్ ని పెట్టుకొని సినిమా పూర్తి చేసి విడుదల చేశాడు.

ఈ సమయంలో ఒకసారి ప్రకాష్ రాజ్ బ్యాన్ కు గురయ్యాడు.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు