Narasimha Naidu : అబ్బో ఆ సినిమాలు మళ్లి విడుదల అంటే..పెద్ద చిక్కే వచ్చి పడిందే !

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుంది.

ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు,ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ అయి ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్న విషయం మనకు తెలిసిందే.

అందులో భాగంగానే జూన్ 10 వ తేదీన బాలయ్య బాబు బర్త్ డే ఉండటం వల్ల ఆరోజు బాలయ్య నటించిన సూపర్ హిట్ సినిమా అయినా నరసింహ నాయుడు( Narasimha Naidu ) సినిమా ని రీరిలీజ్ చేసారు.ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కొట్టిన విషయం మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమా మీద అందరికి మంచి ఒపీనియన్ ఉంది.అలాగే ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులతో పాటు సినిమా అభిమానులు కూడా ఈ సినిమాని మళ్లీ థియేటర్ లో వేస్తె చూడాలని ఎదురు చూసారు.

ఇక లాస్ట్ ఇయర్ కూడా బాలయ్య బర్త్ డే కి చేన్నకేశవ రెడ్డి సినిమా ని రీరిలీజ్ చేసారు.ఈ సినిమాకి కూడా అప్పుడు మంచి వసూళ్లు వచ్చాయి.

Advertisement

ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ బాలయ్య నటించిన నరసింహ నాయుడు సినిమా కంటే కూడా ఆయన సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం లో నటించిన ఆదిత్య 369 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమా తో బాలయ్య అప్పుడు చాలా పెద్ద సాహసమే చేసాడు.

ఎందుకంటే అప్పుడు మాస్ సినిమాలు ఎక్కువగా నడిచేవి ఆరోజుల్లో కూడా సింగీతం గారు చెప్పిన స్టోరీ నచ్చి బాలయ్య ఈ సినిమా చేసారు.అప్పట్లో ఈ సినిమా వెరైటి గా ఉంటూనే మంచి విజయం దక్కించుకుంది.

ఇలా బాలయ్య కెరియర్ లో మంచి హిట్ సాధించి కంటెంట్ కూడా బలంగా ఉన్న ఆదిత్య 369 సినిమాని వదిలేసి బాలయ్య నరసింహ నాయుడు సినిమాని ఎందుకు రీరిలీజ్ చేసారు అంటూ చాలా మంది వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.అయితే ఇలా రీరిలీజ్ చేయడానికి కూడా కారణం లేకపోలేదు నరసింహ నాయుడు సినిమా అయితే మాస్ లోకి ఈజీగా వెళ్తుంది కానీ ఆదిత్య 369 సినిమా క్లాస్ గా సింపుల్ గా ఉంటుంది కాబట్టి రీరిలీజ్ చేస్తున్నప్పుడు అలాంటి క్లాస్ సినిమాల కంటే మాస్ సినిమాలు అయితేనే ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి.అలాగే దాంట్లో అయితేనే హీరో ఎలివేషన్స్, ఫైట్స్ ఉంటాయి.

వాటి వల్లే సినిమా చూసే అభిమానులకి హై ఫీల్ వస్తుంది అనే ఒకే ఒక కారణం వల్ల నరసింహ నాయుడు అనే సినిమా రీరిలీజ్ చేసినట్టు తెలుస్తుంది.ఇక బాలకృష్ణ అనే కాదు, చిరంజీవి సినిమాల్లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీస్ లో ఒకటి అయినా గ్యాంగ్ లీడర్ సినిమాని కూడా రిసెంట్ గా రీరిలీజ్ చేసారు.

రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు...
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021

అయితే చిరంజీవి కెరియర్ లో కూడా స్వయం కృషి( Swayamkrushi ) రుద్రవీణ లాంటి మంచి హిట్ సినిమాలు ఉన్నప్పటికీ గ్యాంగ్ లీడర్ సినిమానే ఎందుకు రీరిలీజ్ చేసారు అంటే అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి విలన్ ఒక దెబ్బ కొడితే హీరో విలన్ ని పది దెబ్బలు కొడతాడు అలా ఉంటేనే ఈ సినిమా చూస్తున్న సేపు ఫ్యాన్స్ మంచి జోష్ లో ఉంటారు.అందుకే మాస్ సినిమాలని మాత్రమే రీరిలీజ్ లకి వాడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు