రెండు సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసిన ప్రభాస్ హీరోయిన్.. కారణం ఏంటి ?

బొద్దు అందాల ముద్దు గుమ్మ నమిత( Namitha ) గుర్తుండే ఉంటుంది.

ఈ మధ్య పెళ్లి చేసుకొని కవల పిల్లలకు జన్మనిచ్చి సినిమాల్లో నటించడం మానేసింది కానీ ఒక ఐదారేళ్ళ వెనక్కి వెళితే తమిళుల ఆరాధ్య దైవం గా ఒక వెలుగు వెలిగింది.

ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీ తో తొలుత నటించడం మొదలు పెట్టిన కూడా తమిళ్ లోనే అగ్ర హీరోయిన్ గా ఎదిగింది.అక్కడి వారికి నచ్చడం కోసం తన నాజూకు అందాలను పక్కన పెట్టి బరువు పెరిగింది.

ఎందుకంటే తమిళ ప్రేక్షకులకు బక్క చిక్కిన హీరోయిన్స్ కంటే బొద్దుగా ఉండే నటీమణులు అంటేనే తెగ ఇష్టం.ఒక ఆమె సినిమాల్లో నటిస్తున్న క్రమం లో రెండు సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసిందట.

మరి ఆలా ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Advertisement

నమితకు సినిమాల్లో నటిస్తున్న హీరోలతో ప్రేమలో పడటం కొత్తేమి కాదు.కానీ ఆమె కేవలం కెరీర్ కోసం మాత్రమే ఆలా చేసేది.నమిత సీరియస్ గా ప్రేమించింది మాత్రం భరత్ కపూర్( Bharat Kapoor ) అనే వ్యక్తిని.

వీరిద్దరి పరిచయం నమిత లవ్ కె చక్కర్ మెయిన్( Love K Chakkar Main ) అనే హిందీ సినిమా షూటింగ్ సమయంలో జరిగింది.అయితే ఆమె కేవలం భరత్ కపూర్ ని లవర్ గా మాత్రమే డీల్ చేయడం లేదు.

ఆమెకు సంబందించిన అన్ని ఫైనాన్షియల్ డీలింగ్స్ ని కూడా భరత్ చేతిలోనే పెట్టింది.దాంతో వారి మధ్య బంధం చాలా ఘాడం గా మారింది.

అయితే నమిత ఒకరోజు హీరో రవిచంద్ర( Ravichandra ) తో సినిమాలో నటిస్తుండగా షూటింగ్ అయిపోయాక ఇద్దరు కాస్త క్లోజ్ గా ఉన్న టైం లో సర్పైజ్ చేయడానికి భరత్ షూటింగ్ స్పాట్ కి రాగానే ఇద్దరినీ కళ్లారా చూసేసరికి గొడవలు మొదలయ్యాయి.దాంతో మొదటి సారి నమిత ఆత్మహత్య ప్రయత్నం చేసింది.ఈ ప్రయత్నం తర్వాత అప్పటికి గొడవ కాస్త సర్దుమణిగిన మరోమారు బిల్లా షూటింగ్ టైం లో ఇలాంటి సంఘటన జరిగి నమిత తో తెగదెంపులు చేసుకున్నాడు భరత్ కపూర్.

నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!
సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?

అప్పటికే ఆమె కు చెందిన చాల డబ్బు భరత్ వాడుకున్నాడు.అవేమి తిరిగి ఇవ్వకపోగా బ్రేకప్ చెప్పడం తట్టుకోలేక నమిత మరోసారి సూయిసైడ్ ప్రయత్నం చేసింది.

Advertisement

తాజా వార్తలు