Chiranjeevi : మెగాస్టార్ అంత మంచి కథకి నో ఎందుకు చెప్పారో ?

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) గురించి కొత్తగా పరిచేయం చేయాల్సిన అవసరం లేదు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవికి ప్రత్యేక స్తానం ఉంటుంది.

మెగా ఫ్యామిలీలో నుంచి చాలా మంది నటులను ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాదు, కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న వారికి కూడా ఇన్స్పిరేషన్.చిరంజీవి వరుస సినిమాలతో బిజీ అయిపోయారు.

అయితే ఈ మధ్య చిరంజీవి సినిమాలు అంచలనాలు అందుకోలేకపోతున్నాయి.చిరంజీవి వరుస రీమేక్ సినిమాలు చేసారు.

ఇక కొడుకు రాంచరణ్ తో కలిసి నటించిన ఆచార్య కూడా నిరాశ పరిచింది.ఆ తరువాత వచ్చిన వాల్తేర్ వీరయ్య బ్లాక్ బస్టర్ కొత్తగా తాజాగా విడుదలైన భోళా శంకర్(Bhola Shankar ) తీవ్ర నిరాశను మిగిల్చింది.

Advertisement

అయితే మెగాస్టార్ట్ ఒక మంచి సినిమాను మిస్ చేసుకున్నారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.

కొన్నిసార్లు ఒక హీరో చేయాల్సిన సినిమా కొన్ని కారణాల వల్ల, అప్పుడు వాళ్ళకి నచ్చకపోవడం వల్ల మిస్ అయ్యి వేరే వాళ్ళు చేస్తుంటారు.అయితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టిన తరువాత ఈ విషయాలు బయటికి వస్తాయి.అప్పుడు ఆ సినిమా చేసి ఉంటె బాగుండేదని, ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ అలాంటి బ్లాక్‌బస్టర్ ను రిజెక్ట్ చేసినందుకు బాధపడుతుంటారు.

తాజాగా మెగా అభిమానులు కూడా మెగాస్టార్ వదులుకున్న ఒక ప్రాజెక్ట్ గురించి అలానే బాధపడుతున్నారు.

మెగాస్టార్ రీఎంట్రీ తరువాత ఖైదీ నం.150 మూవీ( Khaidi No.150 )తో విజయాన్ని సాధించారు.అయితే ఈ సినిమా సమయంలోనే మెగాస్టార్ట్ కి ఒక మంచి సినిమా వచ్చింది.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?

ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ గురించి అందరికి తెలిసిందే.అయితే ఈ ఫ్యామిలీ మ్యాన్ స్క్రిప్ట్ ని దర్హకుడు ప్రొడ్యూసర్ అశ్వనీదత్‌( Ashwini Dutt ) కి చెప్పారు.

Advertisement

ఈ కథను మెగాస్టార్ చిరంజీవితో చేయాలని అశ్వనీదత్‌ భావించి, ఫ్యామిలీమ్యాన్ స్క్రిప్ట్‌( Family Man Series )ని చిరంజీవికి వినిపించారు.అంతేకాదు ఈ స్క్రిప్ట్ మెగాస్టార్ కి చాలా నచ్చింది.

అయితే ఈ సినిమాలో హీరోకి ఇద్దరు పిల్లలు ఉండడంతో చిరంజీవి ఆలోచించారట.అయితే చిరంజీవి అప్పుడే రీఎంట‍్రీ ఇవ్వడం, ఆ సమయంలో ఇలాంటి కథ తనకు సెట్ అవుతుందో లేదో అని పక్కన పెట్టారని నిర్మాత అశ్వనీదత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఇది విన్న మెగా అభిమానులు, ఈ సిరీస్ ని మెగాస్టార్ చేసి ఉంటె బాగుండేదని కామెంట్లు పెడుతున్నారు.

తాజా వార్తలు