Krishna Kumari : ఒకే రోజు 17 సినిమాలను ఫోన్ చేసి క్యాన్సిల్ చేసుకున్న హీరోయిన్.. కారణం ఏంటి ?

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు చాలా కామన్.

అయితే మామూలుగా సాధారణ వ్యక్తుల పెళ్లిళ్లు పెద్ద సెన్సేషనల్ కావు కానీ ఇండస్ట్రీ వారి పెళ్లి అంటే అది పెద్ద వార్త.

ఇక ఇండస్ట్రీలోని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అది మరింత పెద్ద వార్త.ఇక ఇప్పుడైతే పర్వాలేదు కానీ గతంలో పెళ్లయిన హీరోలు సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాక ఏదో ఒక హీరోయిన్ తో మరోమారు ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం లేదా ఎవరినైనా రెండవ పెళ్లి చేసుకోవడం అనేక సార్లు మనం చూసాం.

ఇదే కోవలో ఎన్టీఆర్( NTR ) కూడా రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నారట.అప్పటి హీరోయిన్ కృష్ణ కుమారిని( Krishna Kumari ) ఎంతగానో ఇష్టపడ్డారు ఆయన.కానీ ఆ సమయానికి ఎన్టీఆర్ కి పెళ్లి అయ్యి 13 మంది పిల్లలు ఉన్నారు ఆయనకు.

ఎన్టీఆర్ తో కేవలం 47 మంది హీరోయిన్స్ మాత్రమే పని చేశారు.అందులో జమున( Jamuna ) 36 సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తే సావిత్రి( Savitri ) 26, అంజలి 26, కృష్ణ కుమారి 25 సినిమాల్లో నటించింది.కృష్ణ కుమారితో ఆయన బంధం చాలా గట్టిగానే ఉండేది.

Advertisement

పెళ్లి వరకు వెళ్లి చివరి రోజు క్యాన్సిల్ చేసుకున్నారు అంటూ అనేక వార్తలు వచ్చాయి.అప్పట్లో వాటికి కారణాలు ఏంటో తెలియదు కానీ వెళ్లి మాత్రం జరగలేదు.

ఆమె ఎన్టీఆర్ తో ప్రేమ పెళ్లి జరుగుతుంది అని గంపెడు ఆశలు పెట్టుకున్నారట.కానీ అది జరగక పోయేసరికి కోపంతో ఇండస్ట్రీ ని వదిలి వెళ్లిపోయారు.

ఆ సమయంలో 17 సినిమాలు ఒప్పుకున్న కృష్ణ కుమారి సదరు సినిమా దర్శకులకు ఫోన్ చేసి ఒప్పుకున్నా సినిమాలన్నీ క్యాన్సల్ చేసుకొని డబ్బులు వెనక్కి పంపారట.

అంతేకాదు ఎన్టీఆర్ పై కోపంతో అజయ్ మోహన్( Ajay Mohan ) అనే బెంగుళూరు బిజినెస్ మ్యాన్ నీ పెళ్లి చేసుకున్నారు.ఇక అజయ్ కూడా అప్పటికే వేరే వివాహం చేసుకున్నాడు.అజయ్ మరియు కృష్ణ కుమారి కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

వీరికి సంతానమైతే కలగలేదు కానీ దీపిక అనే పాపను దత్తత తీసుకొని పెంచి పెళ్లి చేశారు.కేవలం ఎన్టీఆర్ పెళ్లి చేసుకోలేదు అన్న కోపంతోనే టాప్ పొజిషన్ లో ఉండి కూడా 17 సినిమాలు క్యాన్సిల్ చేసుకుని రెండో పెళ్లి వాడిని పెళ్లి చేసుకుని బెంగళూరులోని సెటిల్ అయ్యారు కృష్ణ కుమారి.

Advertisement

తాజా వార్తలు