వైసీపీలో సీఎం జగన్ ఏం చెప్తే అది ఫైనల్.ఆయన చెప్పిన మాట పార్టీ నేతలందరూ తూచ తప్పకుండా పాటించాల్సిందే.
అయితే నేతల పనితీరు ఎలా ఉందో జగన్ ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు.ఈ ఫీడ్ బ్యాక్ ఇచ్చేది ఎవరో కాదు ఐప్యాక్ టీమ్.
ఈ టీమ్‌ను నియమించుకున్న సర్వే ఏమని చెప్తుంది.వైసీపీనే గెలుస్తుందని చెప్తుంది.
ఎవరైనా యజమానికి జై కొట్టకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో వేరేగా చెప్పాల్సిన పని లేదు కదా.ఐ ప్యాక్ వ్యవహారం కూడా ఇలాగే ఉంది.మరోవైపు వైసీపీ పెద్దలు సొంతంగా చేయించుకున్న సర్వేలు కూడా ఇంచుమించు ఇలాగే ఉంటున్నాయి.
వాటిని చూసి అధినేత జగన్ కూడా మురిసిపోతున్నారు.తమ వెంట్రుక కూడా పీకలేరని ప్రతిపక్షాలకు సవాళ్లు విసురుతున్నారు.
అయితే గ్రౌండ్ లెవల్లో రియాలిటీ మరోలా ఉందని వైసీపీ కార్యకర్తలు మొత్తుకుంటున్నా జగన్ వినే పరిస్థితుల్లో కనిపించడం లేదు.సాధారణంగా అధికారంలో ఉన్నవాళ్లు నెగిటివిటీని భరించలేరు.
దీనికి వైసీపీ కూడా అతీతమేమీ కాదు.రాజకీయపార్టీల్లో పార్టీ అధినేతకు, కార్యకర్తలకు ఆమడ దూరం ఉంటుంది.
వీళ్ల మధ్యలో ఎందరో నేతలు, ఇంఛార్జులు, కో ఆర్డినేటర్లు అంటూ చాలామంది హడావిడి చేస్తుంటారు.ఈ నేపథ్యంలో జగన్‌కు ఓ మంచి ఆలోచన వచ్చిందని.
ఆయన స్వయంగా కార్యకర్తలతో భేటీ అవుతారని వైసీపీ వర్గాలు అంటున్నాయి.నియోజకవర్గానికి చెందిన కరడు కట్టిన 50 మంది పార్టీ కార్యకర్తలతో జగన్ సమావేశమవుతారని వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి ఎంపిక చేసిన కీలకమైన కార్యకర్తలతో జగన్ సమావేశం నిర్వహిస్తే ఆ సమావేశానికి మంచి ప్రాధాన్యత ఉంటుంది.కానీ నేతల సమావేశం తరహాలోనే కార్యకర్తల సమావేశం జరిగితే ఎందుకు ఉపయోగం ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.వీరితో కనుక అర్ధవంతమైన సమావేశం సాగితే పార్టీ పరిస్థితి, ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాలపై ఎలాంటి సర్వే అవసరం లేకుండా నేరుగా అధినాయకత్వానికి చేరుతాయని భావిస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy