విశ్వక్ సేన్ ఎందుకు డైరెక్షన్ చేస్తున్నాడు అంటే..?

ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో చాలా ఓపెన్ గా ఉండే హీరో విశ్వక్ సేన్( Vishwak Sen ) ఈయన చేసిన సినిమాలు కొన్ని హిట్ అయ్యాయి, మరి కొన్ని ప్లాప్ అయ్యాయి.

ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆయనకి మనసులో ఏది అనిపిస్తే అది దాపరికం లేకుండా పైకి మాట్లాడేస్తూ ఉంటాడు.

అందుకే విశ్వక్ సేన్ మీద ఇండస్ట్రీ లో చాలా నెగిటివిటీ ఉంది అని కొంత మంది అంటుంటే, మరికొంత మంది మాత్రం ఆయనకి ఆటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది అందుకే తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడని మరి కొందరు అంటుంటారు.ఆయన ఆ మధ్య అర్జున్ ( Arjun )తో జరిగిన ఒక చిన్న వివాదం లో తన గురించి పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు, కానీ చాలా మంది అర్జున్ వైపే సపోర్ట్ చేసారు ఎందుకంటే అన్ని సంవత్సరాల ఎక్సపీరియన్సు ఉన్న అర్జున్ ఇంతవరకు ఎప్పుడు కూడా కాంట్రవర్సీ లో ఇరుక్కోలేదు విశ్వక్ సేన్ వల్లే ఫస్ట్ టైం అర్జున్ బయటకి వచ్చాడు అని హకాలమంది సినిమా మేధావులు అన్నారు.

Why Is Vishwak Sen Directing , Vishwak Sen, Arjun, Das Ka Dhamki , Tollywood, In
Why Is Vishwak Sen Directing , Vishwak Sen, Arjun, Das Ka Dhamki , Tollywood, In

ఇక ఇది ఇలా ఉంటె ఆయన తీసిన దాస్ కా ధమ్కీ( Das Ka Dhamki ) సినిమా కి మొదట వేరే డైరెక్టర్ ని పెట్టుకున్నాడు విశ్వక్ సేన్, ఆయన తో జరిగిన చిన్న గొడవల వల్ల ఆయన చాలా బ్యాడ్ అయ్యారనే చెప్పవచ్చు అయితే విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ సినిమా నిన్న రిలీజ్ అయినా విషయం మనకు తెలిసిందే, ఈ సినిమా పర్లేదు అని అనిపించుకున్నప్పటికీ విశ్వక్ కాకుండా వేరే వాళ్ళు డైరెక్షన్ చేసి ఉంటె బాగుండేది అని అందరు అంటున్నారు.అయితే ఎందుకు విశ్వక్ సేన్ డైరెక్షన్ చేసుకుంటూ, యాక్టింగ్ చేస్తున్నాడు, డైరెక్షన్ చేసే ఛాన్స్ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటే ఆయనతో వేగడం చాలా కష్టం అని మరి కొంత మంది అంటున్నారు.అందుకే డైరెక్టర్స్ ని మార్చి ఆయనే స్వయంగా సినిమాలు తీసుకుంటున్నారు అని కూడా అంటున్నారు .

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు