విద్యా వ్యవస్థపై హామీలు అమ‌లు చేయ‌ని ప్ర‌భుత్వం ఎందుకు?

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి తెలంగాణలో విద్యా వ్యవస్థ, అభివృద్ధి ఎక్కడ చూసిన ఎక్కడ గొంగడి అక్కడే అన్న చందంగా తయారయ్యింది.

గత ఎనిమిది సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో విద్యా రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు ఏవీ కూడా లేవు అంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్ఠ ఎంత నీచంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

విద్యా రంగంలో ఎక్కడ కూడా కనీస మౌళిక సదుపాయాలు లేవు కానీ విద్యార్థుల నుండి మాత్రం లక్షల రూపాయల ఫీజులను వసూలు చేస్తున్న పరిణామాలు చాలా ఉన్నాయి.అడ్మిషన్ ఫీజు, ట్యూషన్‌ ఫీజు, పుస్తకాల ఫీజు,పరీక్షల ఫీజు, విద్యార్థుల స్కూల్స్ డ్రెస్ ఫీజు అని రకరకాలుగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తూ వారి జీవితాలతో కార్పోరేట్‌ విద్యాసంస్థల యజమాన్యాలు ఆడుకుంటున్న తీరు దురదృష్టకరం.2014 వ సంవత్సరంలో జరిగిన అస్సెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకవస్తే కె.జి.నుండి పి.జి.వరకు ఉచిత నిర్బంధ విద్యను అందిస్తామని గొప్పలు చెప్పిన కేసీఆర్, అధికారంలోకి వచ్చిన తర్వాత కె.జి.నుండి పి.జి.ఉచిత నిర్బంధ విద్య గురించి ద్యాసే లేదు.ఆదాయాలను,ఆస్తులను సంపాదించుకోవడమే లక్ష్యంగా విద్యాసంస్థలు నడుస్తున్నాయి కానీ విద్యార్థులకు విద్యను అందించి గొప్ప ఆలోచన కల్గిన మేధావులుగా తయ్యారుచేద్దామనే సోయి లేదు.

ఈ క్రమంలో ప్రభుత్వ విద్యాసంస్థలలో సరిగ్గా సిబ్బంది లేక, ఒకవేళ సిబ్బంది ఉన్నా సమయానికి రాకపోవటంతో ప్రభుత్వ విద్యాసంస్థలలో కోత్తగా నేర్చుకోవడానికి అవకాశమే లేకుండా పోతుంది.ఇక ప్రవేట్ విద్యాసంస్థలలో అధిక ఫీజుల వసూళ్ల కారణంగా విద్యార్థుల సమస్యలను, విద్యార్థుల తల్లిదండ్రుల సమస్యలను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

నాణ్యమైన విద్యను అందించడం కోసమని కార్పోరేట్ విద్యాసంస్థలు ఏర్పడి, నాణ్యమైన విద్యను అందించకుండా విద్యార్థుల నుండి అధిక ఫీజులను వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులను అధిక మొత్తంలో వసూలు చేసుకోవడమే లక్ష్యంగా కార్పోరేట్ విద్యాసంస్థలు పని చేస్తున్న తీరును మనం నిత్య జీవితంలో గమనిస్తున్నాం.ఫీజుల విషయంలో కార్పోరేట్‌ విద్యాసంస్థల యజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరుతో, పేద,బడుగు,బలహీన వర్గాల వారికి భారం కావడంతో విద్యార్థులు ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయా యాజమాన్యాలపై ఏ మాత్రం చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణం.

Advertisement
Why Is The Government Not Implementing The Guarantees On The Education System ,

ఫీజులను నియంత్రించడం కోసం ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకోవస్తామని ఎన్నికల మేనిఫెస్తోలో చెప్పిన కెసిఆర్ ఆ హామీని విస్మరించి విద్యార్థుల నుండి వచ్చే ఫీజులను వ్యాపారంగా మార్చుకొని విద్యాసంస్థల యజమాన్యాలు అక్రమంగా డబ్బులను సంపాదిస్తున్నాయి.శ్రీ.

నారాయణ, శ్రీ.చైతన్య మరియు ఇతర కార్పోరేట్‌ విద్యాసంస్థలలో దోపిడీలకు, అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.

ఈ విద్యాసంస్థలలో విద్యార్థులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కున్న ఆ సమస్యలను పరిష్కరించి ఆయా కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకున్న సందర్భాలు ఒక్కటి కూడా లేవు.అంటే దీని బట్టి కార్పోరేట్ విద్యాసంస్థలకు రహస్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వ సహకారం ఉందని తెలిపోయింది.

విద్యాసంస్థలలో జరుగుతున్న అక్రమాలపై విద్యార్థులకు మద్దతుగా విద్యార్థి సంఘాలు కార్యక్రమాలు చేస్తే విద్యార్థి సంఘాల నేతలపైనే చర్యలు తీసుకున్నారు తప్ప, తప్పు చేసిన యజమాన్యలపై మాత్రం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు.

Why Is The Government Not Implementing The Guarantees On The Education System ,
సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

విద్యార్థుల పట్ల నిజంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఏర్పాటు చేసి పకడ్బందీగా అమలు చేయ్యాల్సిన అవసరం ఉంది.తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని కలలుకంటున్న పేద తల్లితండ్రులు ఇంటర్ మీడియట్, ఇంజనీరింగ్‌ కళాశాలలలో ఉంటున్న ఫీజులను చూసి భయపడి వారి యొక్క ఆశయాలను, లక్ష్యాలను చంపుకుంటున్న సందర్భాలను గమనిస్తూనే ఉన్నాం .తెలివి,మెధోసంపత్తి, ఆలోచించే సామర్థ్యం, చదువుపై ఆసక్తి ఉన్న పేదవారు విద్యకు దూరం కాకుండా దేశం గర్వించదగ్గ ప్రయోజకులుగా తయారుకావాలంటే పేద వారి సామర్థ్యాలను గుర్తించి ఫీజుల నియంత్రణ కోసం, ఫీజుల నియంత్రణ చట్టాన్ని తక్షణమే అమలు చేయ్యాలి.

Advertisement

తాజా వార్తలు