జగన్‌లో అసహనం ఎందుకు పెరుగుతోంది?

ఏపీలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు కైవసం చేసుకుంది.

గెలవడమే గగనం అనుకున్న తరుణంలో ఇలాంటి విజయం సాధిస్తామని జగన్ కూడా భావించలేదు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కూడా తమనే ప్రజలు మరోసారి ఆదరిస్తారని మొన్నటివరకు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు.ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడం జగన్ ధీమాకు కారణం కావొచ్చు.

అయితే గడప గడపకు కార్యక్రమంలో వైసీపీలోని డొల్లతనాన్ని బహిర్గతం చేసింది.తిరుగులేని విధంగా అధికారం కట్టబెడితే వైసీపీ ప్రభుత్వం వల్ల ఒరిగిందేమీ లేదని ప్రజలు భావిస్తున్నారు.

అయితే సంక్షేమ పథకాల పేరుతో కోట్లకు కోట్లు అప్పులు తెచ్చి మరీ ప్రజలకు పంచిపెడుతున్నా ఫలితాలు పెద్దగా కనిపించడంలేదని ఫీడ్ బ్యాక్ వస్తోంది.దీంతో ఎందుకిలా జరుగుతోందని జగన్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఇటీవల వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ నిర్వహించిన వర్క్ షాప్‌లో సైతం నూటికి 87 శాతం కుటుంబాలకు అన్ని రకాలుగా న్యాయం చేశామని, సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తున్నామని చెప్పుకొచ్చారు.ఈ విషయాలను గ్రౌండ్ లెవల్లోకి తీసుకువెళ్లాలని జగన్ ఆదేశించారు.

అయితే ప్రజలు వైసీపీ ప్రభుత్వం గురించి వేరే విధంగా ఆలోచిస్తున్నారు.సంక్షేమ ఫలాలు అందరికీ దక్కడం లేదని.

ఒకవేళ అందినా ఆ నిధులను అనేక రకాలైన పన్నులతో మళ్లీ వెనక్కి తీసుకుంటున్నారనే భావనలో ఉన్నారు.

తమకు కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాగేసుకోవడం సబబుగా లేదని అభిప్రాయపడుతున్నారు.వైసీపీ హయాంలో నిత్యావసర ధరలన్నీ పెరిగిపోయాయని ప్రజలే ఆవేదన చెందుతున్నారు.మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు, కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీల పేరుతో బాదుడే బాదుడు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు కూడా అధికార ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 13 , శుక్రవారం , 2023

ఇంకా ఎన్నికలకు రెండేళ్లు కూడా లేవు.ఈ నేపథ్యంలో ఎన్నికల నాటికి తమపై వ్యతిరేకత ఎలా తగ్గించాలో తెలియక జగన్ సతమతం అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది.దీంతో జగన్‌లో ధీమా కంటే అసహనం ఎక్కువ కనిపిస్తోందని.

Advertisement

ఈ అసహనం ఆయన ప్రసంగాల్లో చూడొచ్చని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు.