పెళ్ళిలో బాసికం యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

మన పెద్దవారు పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని అనటం తరచుగా వింటూ ఉంటాం.

అబ్బాయికి అయినా అమ్మాయికి అయినా పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్యమైన అంశం అని చెప్పవచ్చు.

పెళ్లిలో ఇరు కుటుంబాల ఆచార వ్యవహారాలు ప్రతిబింబిస్తూ ఉంటాయి.పెళ్ళిలో జరిగే ప్రతి ఘట్టానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.

వాటిలో వధూవరులకు కట్టే బాసికం.బాసికం ధరించగానే వధూవరులలో పెళ్లి కళ వచ్చేస్తుంది.

అంతేకాక బాసికం కట్టటంలో కూడా శాస్త్రీయ పరమైన అర్ధం ఉంది.పెళ్ళిలో అత్యంత ముఖ్యమైన ఘట్టం సుముహూర్తం సమయంలో వధువు వరుడి రెండు కనుబొమల మధ్య ప్రదేశాన్ని చూడాలి.

Advertisement

అదే విధంగా వరుడు వధువు రెండు కనుబొమల మధ్య స్థానాన్ని అంటే బొట్టు పెట్టుకునే స్థానాన్ని చూడాలి.ఇది మర్చిపోకుండా ఉండటానికి ఇద్దరి ద్రుష్టి ఆ ప్రదేశంపై పడటానికి నుదుటిన బాసికం కడతారు.

ఈ విధంగా చేయడం వల్ల ఒకరి పై ఒకరికి ఆకర్షణ పెరిగి తాము ఒక్కటే అనే భావన కలుగుతుందని శాస్త్రం చెప్పుతుంది.

Advertisement

తాజా వార్తలు