ఎక్కిళ్ళు ఎందుకు వ‌స్తాయి.. వాటిని ఆప‌డం ఎలా..?

దాదాపు ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక స‌మ‌యంలో ఎక్కిళ్ళను ఫేస్ చేసే ఉంటారు.కొంద‌రికి ఉదయం లేవ‌డం లేవ‌డంతోనే ఎక్కిళ్ళు ప్రారంభ‌మై.

ఆ రోజంతా కంటిన్యూ అవుతుంటాయి.ఎక్కిళ్ళు( hiccups ) పెద్ద స‌మ‌స్య కాన‌ప్ప‌టికీ.

కొంచెం అసౌక‌ర్యానికి గురి చేస్తాయి.అస‌లు ఎక్కిళ్ళు ఎందుకు వ‌స్తాయి.? వాటిని త్వ‌ర‌గా ఆప‌డం ఎలా.? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.డయాఫ్రాగం అనబడే కండరాలు అనుకోకుండా సంకోచించినప్పుడు, గాలి వేగంగా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి, గొంతులోని స్వరతంత్రులు ఆకస్మికంగా మూసుకుపోవడంతో వ‌చ్చే ధ్వనినే ఎక్కిళ్ళు అంటారు.

ఎక్కిళ్ళు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి.కారంగా లేదా మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, వేగంగా తిన‌డం, కడుపులో గ్యాస్, వాట‌ర్ లేదా ఏమైనా డ్రింక్స్ తాగేటప్పుడు గాలిని మింగడం, ఎమోషనల్ స్ట్రెస్‌, ఆల్కహాల్( Emotional stress, alcohol ) లేదా కార్బొనేటెడ్ పానీయాలు అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఎక్కిళ్ళు వ‌స్తాయి.

Advertisement
Why Hiccups Occur And How To Stop Them? Hiccups, Diaphragm, Health, Health Tips,

అలాగే నరాల సమస్యలు, అంతర్గత అవయవాల సమస్యలు, కొన్ని మందుల వాడ‌కం కూడా ఎక్కిళ్లను ప్రేరేపించవచ్చు.

Why Hiccups Occur And How To Stop Them Hiccups, Diaphragm, Health, Health Tips,

ఇక ఎక్కిళ్ళ‌ను త్వ‌ర‌గా ఆప‌డానికి కొన్ని ఇంటి చిట్కాల‌ను ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు.చల్లని నీటిని మెల్ల మెల్ల‌గా తాగడం ద్వారా డయాఫ్రాగం ప్ర‌శాంతంగా మారుతుంది.ఎక్కిళ్ళు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

అలాగే ఎక్కిళ్ళు వ‌స్తున్న‌ప్పుడు కొద్దిగా నిమ్మరసం తాగడం లేదా నిమ్మకాయ ముక్కను నోట్లో ఉంచి చప్పరించడం చేయాలి.ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

Why Hiccups Occur And How To Stop Them Hiccups, Diaphragm, Health, Health Tips,

ఎక్కిళ్ళు రోజంతా వ‌స్తూనే ఉంటే కొద్దిగా వేడి పాలలో తేనె( Honey in hot milk ) కలిపి తాగండి.ఇది జీర్ణ వ్యవస్థను ప్రశాంతంగా చేసి డయాఫ్రాగం కుదింపును తగ్గిస్తుంది.ఫ‌లితంగా ఎక్కిళ్ళ నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతారు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

చ‌క్కెర‌తో కూడా ఎక్కిళ్ళ‌ను త‌గ్గించుకోవ‌చ్చు.ఒక టీ స్పూన్ చక్కెర నోట్లో ఉంచి మెల్లగా నమిలితే.

Advertisement

నరాల క్షోభ తగ్గి ఎక్కిళ్లు ఆగుతాయి.ఇక లోతుగా ఊపిరి పీల్చి.

ప‌ది నుంచి ప‌దిహేను సెకన్లపాటు ఆపి నెమ్మదిగా వదలడం చేసినా ఎక్కిళ్ళు ఆగుతాయి.

తాజా వార్తలు