అందరికీ అతనే కావాలట.. ఆ ఒక్క హీరో కోసం హీరోయిన్ల మధ్య ఇంత పోటీనా?

ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ క్రేజియస్ట్ హీరో ఎవరు అంటే అందరూ చెప్పే పేరు విజయ్ దేవరకొండ.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక చిన్న సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఇక ఇప్పుడు అమ్మాయిల అందరి మనసులు కొల్లగొట్టే ప్లేబాయ్ గా మారిపోయాడు.

సాధారణంగా హీరోలకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది.కానీ మునుపెన్నడూ లేనివిధంగా విజయ్ దేవరకొండ కి హీరోయిన్ల ఫాలోయింగ్ ఎక్కువ అయిపోయింది.

ఒకవేళ ఛాన్స్ వస్తే మీరు ఎవరితో డేటింగ్ చేయాలనుకుంటారు అని ఏ హీరోయిన్ను ప్రశ్నించినా అందరినోట వినిపిస్తున్న పేరు విజయ్ దేవరకొండ.మిల్కీ బ్యూటీ తమన్నా సైతం ఒకానొక ఇంటర్వ్యూలో ఒకవేళ మీరు లిప్ లాక్ ఇవ్వాల్సి వస్తే ఏ హీరోకి ఇస్తారు అని అడిగితే ఠక్కున విజయ్ దేవరకొండ పేరు చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.

దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇక విజయ్ దేవరకొండ క్రేజ్ ఎంతలా పెరిగి పోయింది.సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి అంటూ ఉంటారు కదా.అచ్చం ఇలాగే విజయ్ దేవరకొండ చుట్టూ ఇక హీరోయిన్లు కూడా తిరుగుతూ ఉన్నారు అని చెప్పాలి.తెలుగు ఇండస్ట్రీ లోనే కాదండోయ్ అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విజయ్ అంటే పడి చచ్చిపోతున్నారూ అభిమానులు.

Advertisement

లైగర్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమా విడుదలకు ముందు నుంచి ఊహించని రేంజిలో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

ఇటీవలే కాఫీ విత్ కరణ్ షో కి వచ్చిన హీరోయిన్స్ అందరూ కూడా విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతున్నారు.మాట్లాడేటప్పుడు మెలికలు తిరిగి పోతూ ఉన్నారు.అనన్య పాండే దగ్గర నుంచి మొదలుపెడితే జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ గారాలపట్టి సారా అలీ ఖాన్, రష్మిక మందన్న, చివరికి సమంత ఇలా వరుసబెట్టి హీరోయిన్లూ అందరూ కూడా విజయ్ కు అభిమానులుగా మారిపోయారు.

ఇటీవలే విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన న్యూడ్ ఫోటోలను సైతం షేర్ చేసి తెగ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు అని చెప్పాలి.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు