ముక్కోటి ఏకాదశి రోజు భోజనం చేయకూడదని ఎందుకు అంటారో తెలుసా..

మన దేశ వ్యాప్తంగా దాదాపు ప్రజలందరూ వైకుంఠ ఏకాదశిని ఎంతో విశిష్టమైన రోజుగా భావిస్తారు.

మార్గశిర మాసంలో శుక్లాపక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు.

సూర్యుడు ఉత్తరాయానంలోకి ప్రవేశించడానికి ముందు ఈ ఏకాదశి వస్తుంది.ఈ రోజున శ్రీమహావిష్ణువుని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని, అంతేకాకుండా పాపాలు కూడా దూరమై మోక్షం లభిస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.

అందుకే ఈ ఏకాదశిని మోక్షదా ఏకాదశి అని కూడా పిలుస్తారు.ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వస్తారని అందుకే ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారని అష్టదశ పురాణాలలో ఉంది.

ముక్కోటి అంటే మూడు కోట్ల మంది దేవతలు కాదని చాలామంది తెలుసుకోవాలి.కోటి అంటే సమూహం అని అర్థం.3 సమూహాలకు చెందిన దేవతలతో కలిసి విష్ణువు భూలోకానికి వస్తారని దీని పరమార్ధం.ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిదని శాస్త్రంలో ఉంది.

Advertisement
Why Fasting On Mukkoti Ekadashi Details, Fasting ,mukkoti Ekadashi, Mukkoti Ekad

ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు.ఉపవాసం ఉంటే మంచి జరుగుతుందని ముఖ్యంగా బియ్యంతో చేసిన పదార్థాలు తినకూడదని చెబుతూ ఉంటారు.

ఏకాదశి రోజున భోజనం ఎందుకు చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం.మన పురాణాల ప్రకారం సత్య యుగంలో మూరా అనే రాక్షసుడు ఉండేవాడు.

బ్రహ్మదేవుడి ద్వార వరం పొంది కొన్ని శక్తులను ఆ రాక్షసుడు పొందుతాడు.ఆ శక్తులను ప్రజలను, భక్తులను, దేవతలను హింసించడానికి ఆ రాక్షసుడు ఉపయోగిస్తూ ఉంటాడు.

Why Fasting On Mukkoti Ekadashi Details, Fasting ,mukkoti Ekadashi, Mukkoti Ekad

ఆ సమయంలో దేవతలు, ఋషులు ఈ రాక్షసుడు నుండి లోకాన్ని రక్షించమని శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తారు.అయితే మురతో వెయ్యిళ్లపాటు యుద్ధం చేయగా యుద్ధంలో అలసిన విష్ణు ఒక గృహలో విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది.విశ్రాంతి తీసుకునే సమయంలో ముర రాక్షసుడు అక్కడికి వచ్చి న విష్ణువును అంతం చేయాలనుకుంటాడు.

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

అయితే విష్ణు యొక్క తేజస్సు నుంచి యోగ మాయ అనే కన్య ఉద్భవించి రాక్షసుడుని సంహరిస్తుంది.శుక్లపక్షంలో 11వ రోజున ఆ కన్య ఉద్భవించడంతో ఏకాదశి అని పేరు పెట్టారు.

Advertisement

అంటే రాక్షసుడిని అంతం చేసిన రోజు కాబట్టి ఆ రోజున ఉపవాసం ఉండి విష్ణువును భక్తిశ్రద్ధలతో పూజిస్తే మనిషిలో ఉన్న రాక్షస గుణాలు, చేసిన పాపాలు దూరం అవుతావని చెబుతూ ఉంటారు.

తాజా వార్తలు