శరీరానికి ఫైబర్ ఎందుకు అవసరం.. ఫైబర్ కోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి?

ఆరోగ్యంగా మరియు ఫిట్ గా ఉండాలి అంటే మన శరీరానికి విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్ల తో పాటు ఫైబర్( Fiber ) కూడా చాలా అవసరం.

జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం అనేది ఫైబర్ పైనే ఆధారపడి ఉంటుంది.

తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో, జీర్ణమైన ఆహారాన్ని బయటకు పంపడంలో మరియు శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో ఫైబర్ కీలక పాత్రను పోషిస్తుంది.అలాగే శరీరంలో చక్కెర నిల్వలను అదుపులో ఉంచడానికి, బరువు నిర్వహణకు, గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి ఫైబర్ అవసరం.

శరీరానికి సరిపడా ఫైబర్ అంద‌నప్పుడు మలబద్ధకం బారిన పడతారు.రక్తంలో చక్కెర స్థాయిలో( Blood Sugar Levels ) హెచ్చుతగ్గులు ఏర్పడతాయి.

అలాగే శ‌రీరంలో ఫైబర్ త‌గిన మొత్తంలో లేకపోవడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటుంది.జీర్ణవ్యవస్థలో ( Digestive System ) ఏర్పడే అడ్డంకుల వల్ల తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాదు.

Advertisement

ఇది క్రమంగా బరువు పెరుగుద‌ల‌కు దారి తీస్తుంది.అంతేకాదు ఫైబర్ కొరత వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండెకు ముప్పు పెరుగుతుంది.

అందువల్ల నిత్యం ఆహారంలో ఫైబర్ తో కూడిన ఆహారాలను చేర్చుకోవాలి.ఫైబర్ కోసం రోజు ఉదయం సబ్జా గింజలు లేదా చియా సీడ్స్ ను( Chia Seeds ) తీసుకోండి.వీటిలో ఫైబర్ తో పాటు అనేక పోషకాలు సైతం మెండుగా ఉంటాయి.

వాటర్ లో సబ్జా లేదా చియా గింజలు నానబెట్టి తీసుకుంటే ఫైబర్ కొరతకు దూరంగా ఉండవచ్చు.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!

అలాగే ఫైబర్ కోసం తాజా కూర‌గాయలు, పండ్లు తీసుకోండి.చాలామంది పండ్లను జ్యూస్ చేసుకుని తాగుతారు.దీని వల్ల అందులో ఫైబర్ పోతుంది.

Advertisement

అందుకే ఫ్రూట్స్ ను నేరుగా తినడమే మేలు.అంతేకాకుండా ఫైబర్ కోసం ఓట్స్, తృణధాన్యాలు, పప్పులు, బాదం, బ్రౌన్ రైస్, బీన్స్, చిలకడ దుంపలు, జామ, అవకాడో, అరటి వంటి పండ్లు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, గోధుమలు వంటి ఆహారాలను తీసుకోండి.

తాజా వార్తలు