వినాయకుని దర్శనం తరువాత మొట్టికాయలు ఎందుకు వేసుకుంటారు ?

ఒక్కసారి చిన్నతనంలో బాల గణేశుడు కోపం వచ్చి అలిగాడు.వినాయకుని అలక మాన్పించటానికి పార్వతీదేవి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిన ఎటువంటి లాభం లేకపోయింది.

పార్వతికి ఏమి చేయాలో తెలియక బ్రహ్మాది దేవతలను పిలిచింది.వారు కూడా తాము చేయవలసిన ప్రయత్నాలను చేసారు.

అయినా వినాయకుని ముఖంలో నవ్వు కనపడలేదు.చివరికి ఏమి చేయాలా అని ఇంద్రుడు తల మీద మొట్టుకున్నాడు.

ఆ సమయంలోనే గణపతి ముఖంలో నవ్వు కన్పించింది.అది చుసిన ఇంద్రుడు మిగిలిన దేవతలతో కలిపి మొట్టికాయలు వేసుకోవటం ప్రారంభించారు.

Advertisement

మరి కొంత మంది అయితే గుంజీలు తీయటం ప్రారంభించారు.దాన్ని చూసి బాల గణపతి పక పక నవ్వటం ప్రారంభించెను .ఇక అప్పటి నుంచి గణపతిని ప్రసన్నం చేసుకోవటానికి మొట్టికాయలు వేసుకోవటం ప్రారంభం అయ్యి అది సంప్రదాయంగా మారింది.

హర్ట్ అయినా ప్రభాస్ ఫాన్స్.. దీని కోసమేనా ఇన్నాళ్ల వెయిటింగ్
Advertisement