గత 15 ఏళ్లలో రజినీకాంత్ చేసిన ఈ సినిమాలు ఎందుకు ప్లాప్ అయ్యాయంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో ఒక సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమా మీద ప్రేక్షకుల విపరీతమైన అంచనాలైతే ఉంటాయి.

ఇక దానికి తగ్గట్టుగానే ఆ స్క్రిప్ట్ లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా, దాన్ని చక్కగా తెరకెక్కించే విధంగా ఆయనకు సపోర్ట్ చేస్తూ వస్తుంటారు.

ఇక ఇలాంటి క్రమంలోనే దర్శకులు సినిమాలు చేస్తు సూపర్ హిట్స్ గా నిలుపుతారు.ఇక మరి కొన్ని సినిమాలు మాత్రం ఏదో ఒక కారణం చేత ఫ్లాపులుగా మిగిలిపోతూ ఉంటాయి.

ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన రజినీకాంత్ ( Rajinikanth )తమిళ్ తో పాటు తెలుగులో కూడా తన మార్కెట్ ని భారీగా విస్తరించుకున్నాడు.తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరితో పోటీ పడుతూ తను కూడా ఇక్కడ స్టార్ హీరోగా ఎదగడం అనేది మామూలు విషయం కాదు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన సినిమాలు డిజాస్టర్ ఎందుకు అయ్యాయి అనేది పక్కన పెడితే అవి ఏ సినిమాలు అంటే కథానాయకుడు, రోబో 2, కొచ్చాడియన్,ఇక రీసెంట్ గా వచ్చిన లాల్ సలాం( Lal Salaam ) ఇవన్నీ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఈ కథల మీద దర్శకులు తీసుకున్న శ్రద్ధ చాలావరకు తగ్గిందనే చెప్పాలి.

రజనీకాంత్ లాంటి ఒక స్టార్ హీరో ఉన్నప్పుడు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ని ఎక్కువగా వాడుకుంటూ ముందుకెళ్లాలి.కానీ ఈ సినిమాలన్నింటిలో కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి.అందువల్లే ఈ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

Advertisement

ఇక ప్రస్తుతం రజినీకాంత్ లోకేష్ కనక రాజ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా మీదే తన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది.

హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు