ఆ సినిమాలో నటించకపోవడమే చిరు ఆరోగ్యానికి రహస్యమట..?

1978లో ప్రాణం ఖరీదు సినిమాతో చిరంజీవి( Chiranjeevi ) సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఆ తర్వాత ఆయన ఎన్నో సినిమాలు తీశాడు.

1983లో విడుదలైన ఖైదీ సినిమాతో హీరోగా మారాడు.అంతేకాదు ఆ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.నిజానికి దీని కంటే ముందు నుంచే చిరంజీవి హీరో వేషాల కోసం ఎంతో ప్రయత్నించాడు.1981లో "జే గంటలు" సినిమా( Jegantalu Movie ) వచ్చింది.అందులో హీరో వేషానికి ఆడిషన్స్ జరిగినప్పుడు కూడా చిరంజీవి వెళ్లాడు.

విజయబాపినీడు,( Vijaya Bapineedu ) కాట్రగడ్డ మురారి( Katragadda Murari ) కలిసి ఈ సినిమా నిర్మించారు.అయితే ఈ సినిమాకి హీరోగా చిరంజీవిని తీసుకుందామని మేకర్స్ అనుకుంటే విజయ బాపినీడు మాత్రం చిరంజీవి వద్దు అని చెప్పాడు.

Why Chiranjeevi Escaped To Act In This Movie Details, Chiranjeevi, Chiranjeevi M

జోక్ ఏంటంటే, కొంతకాలానికి ఇదే విజయ బాపినీడు చిరంజీవిని హీరోగా పెట్టి గ్యాంగ్ లీడర్ (1991), మగమహారాజు (1983) లాంటి సినిమాలు డైరెక్ట్ చేశాడు.ఆ సినిమాలతో భారీ హిట్స్ అందుకున్నాడు.కానీ జే గంటలు సినిమాలో మాత్రం చిరంజీవిని హీరోగా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు.

Advertisement
Why Chiranjeevi Escaped To Act In This Movie Details, Chiranjeevi, Chiranjeevi M

ఆయనకు బదులుగా రామ్ జీ అనే దాసరికి బాగా తెలిసిన నటుడిని తీసుకున్నారు.ఈ యాక్టర్ కి నటి కిరీటి రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ చెప్పాడు.

Why Chiranjeevi Escaped To Act In This Movie Details, Chiranjeevi, Chiranjeevi M

కథ, మాటలు, పాటలు ఆత్రేయను రాయాలని కోరారు కానీ ఆయన అందుకు ఒప్పుకోలేదు.దాంతో వేటూరితో సాంగ్ లిరిక్స్ రెడీ చేయించి, ఆ పాటలకు అనుగుణంగానే స్టోరీ డెవలప్ చేసుకున్నారు.సింగీతం శ్రీనివాసరావును( Singeetham Srinivasa Rao ) డైరెక్టర్ గా తీసుకొని సినిమా పట్టాలెక్కించారు.

అయితే ఈ దర్శకుడి వైఖరి నిర్మాత మురారికి నచ్చలేదు.అందుకే టైటిల్స్‌లో డైరెక్టర్ పేరును ఎస్.శ్రీనివాసరావు అని మాత్రమే వేశారు.1983 తర్వాత చిరంజీవి స్టార్ హీరో అయిపోయాక ఆయనతో సినిమా తీయకపోవడం వల్లే తాను ఆరోగ్యంగా ఉన్నట్టు మురారి సంచలన కామెంట్స్ చేశారు.చిరంజీవి కూడా కౌంటర్ ఎటాక్ చేశాడు.

మురారి మూవీలో నటించకపోవడం వల్లే తన ఆరోగ్య రహస్యం అని ఆయన కూడా సెన్సేషనల్ కామెంట్స్‌ చేశారు.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

1987లో మురారి మేనల్లుడు భార్గవ్ రామ్ చిరంజీవిని హీరోగా, భారతీ రాజాను డైరెక్టర్ గా "ఆరాధన" సినిమా స్టార్ట్ చేశాడు.కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు నుంచి నిర్మాతగా తప్పుకున్నాడు.ఆ సినిమాని అల్లు అరవింద్ కు అమ్మేశాడు.

Advertisement

గీత ఆర్ట్స్ బ్యానర్ పై దీనిని రిలీజ్ చేసిన అల్లు అరవింద్ కి నష్టాలు వచ్చాయి.ఎందుకంటే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది.

జేగంటలు సినిమా విషయానికి వస్తే ఇందులో హీరోయిన్‌గా అరుణను తీసుకున్నారు.ఆమె భారతీరాజా "కలుక్కుం ఈరమ్"లో నటించి బాగా గుర్తింపు తెచ్చుకుంది.

దీనికి వంశీ అసిస్టెంటు డైరక్టర్.కొన్ని సన్నివేశాలు కూడా సొంతంగా రాశాడు.

మహదేవన్ మ్యూజిక్ అందించాడు.ఆ పాటలు బాగానే హిట్ అయ్యాయి.1981లో విడుదలైన ఈ సినిమా చాలా నిరాశపరిచిందని సింగీతం శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.సత్యానంద్ మాట్లాడుతూ మురారి సింగీతాన్ని స్వేచ్ఛగా సినిమాని తీయనివ్వలేదని అన్నాడు.

నిర్మాత మురారి ఈ మూవీలో కలగజేసుకోకపోతే ఇది హిట్ అయి ఉండేదేమో అని చాలామంది అభిప్రాయపడుతుంటారు.ఏదేమైనా చిరంజీవితో సినిమా చేయకపోవడం మురారి దురదృష్టమని చెప్పుకోవచ్చు.

తాజా వార్తలు