చంద్రబాబు జగన్‌ను ఆ డ్రగ్‌ లార్డ్‌తో పోల్చారు.. అతడి చరిత్ర తెలిస్తే షాకే..

ఏపీ సీఎం చంద్రబాబు వైఎస్ జగన్‌ను "పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గవిరియా" అనే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ లార్డ్, నార్కో టెర్రరిస్ట్‌తో పోల్చి షాకిచ్చారు.

పాబ్లోలాగా జగన్‌కు( Jagan ) డబ్బు అంటే పిచ్చి అని, దానికోసం ఏమైనా చేస్తారని, వీళ్ళు పాలిటిక్స్ లో ఉంటే మరింత ప్రమాదకరమని చంద్రబాబు( Chandrababu ) చెప్పుకుంటూ పోయారు.

ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉగ్రవాదితో పోల్చడం తప్పో ఒప్పో తెలియదు కానీ ప్రస్తుతం పాబ్లో ఎస్కోబార్( Pablo Escobar ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ మారాడు.ఇతడు చాలా ధనవంతుడు.

అంతేకాదు అత్యంత కిరాతకుడు కూడా.బహుశా ఈ భూ ప్రపంచం అంతటి క్రూరుడిని చూసి ఉండదు.

కొలంబియన్‌ డ్రగ్ లార్డ్ జీవితంపై ఇప్పటికే అనేక పుస్తకాలు, సినిమాలు, టీవీ షోస్ విడుదలై సంచలనం సృష్టించాయి.ఇతడు ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకటిగా రాణించాడు.

Advertisement

స్మగ్లింగ్( Smuggling ) చేసే సమయంలో అతడికి నోట్ల కట్టలు బస్తాల్లో వచ్చేవి.వాటికి రబ్బర్ బ్యాండ్స్‌ వేయడానికి వారానికే వెయ్యి డాలర్లు ఖర్చు అయ్యేది.

అంటే ఎన్ని రబ్బర్ బ్యాండ్స్‌ కొనేవారో అర్థం చేసుకోవచ్చు.అతడి సంపాదన ఏ లెవెల్ లో ఉందో కూడా ఊహించవచ్చు.అప్పట్లో ఒక డాలర్ రూ.30కి సమానం.దీని అర్థం డబ్బులకు వేసే రబ్బరు బ్యాండ్స్‌కే ఇతడు 30,000 ఖర్చు చేసేవాడు.

సొమ్ము మొత్తం గోడౌన్లలో సీక్రెట్ గా దాచేవారు.ఏటా ఎలుకలు 10 శాతం డబ్బులను కొరికి పాడు చేసేవి.ఈ డ్రగ్ లార్డ్( Drug Lord ) డబ్బు లెక్క పెట్టడానికి ప్రత్యేకంగా మనుషులను పెట్టుకుంటారు.

ఒక రూమ్ కేటాయిస్తారు.అయితే పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ మనీ కౌంటింగ్ కోసం ఒక గదికి 100 రెట్లు పెద్దగా ఉన్న ఆఫీస్ ఉండేది! 1989లో ప్రచురించిన ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం పాబ్లో 227 మోస్ట్ రిచెస్ట్ పర్సన్స్‌లో ఒకడిగా నిలిచాడు.

కైకాల సత్యనారాయణ జీవితంలో ఆసక్తికర సంఘటన.. విషం కూడా వరంగా మారిందే..?? 
రాజమౌళి సినిమాపై రవితేజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అంతకుమించిన అవార్డు లేదంటూ?

ఆ కాలంలో ఈ డ్రగ్ లార్డ్ వరల్డ్ కొకైన్ మార్కెట్‌లో 80% వాటా కలిగి ఉన్నాడు.ఏటా 30 బిలియన్ డాలర్లు సంపాదించేవాడు.

Advertisement

ఇంత పెద్ద ధనికుడు జీవితం ఎలా స్టార్ట్ అయిందంటే ఈ డ్రగ్ లార్డ్ సమాధుల మీద విలువైన రాళ్లను కొట్టేసేవాడు.వాటినే కొత్త సమాధుల కోసం అమ్ముతూ జీవనం సాగించేవాడు.

ఆపై ఫేక్ బ్రాండ్ల సిగరెట్లు, ఫేక్ లాటరీ టికెట్లు విక్రయిస్తూ కొంత డబ్బు సంపాదించాడు.అనంతరం వెహికల్స్ దొంగలించి బ్లాక్ మార్కెట్లో అమ్మేవాడు.ఫేక్ డిప్లొమా సర్టిఫికెట్లు కూడా తయారు చేసే సొమ్ము చేసుకున్నాడు.

అలాంటి నేరాలు చేస్తూ చేస్తూ చివరికి ఒక పెద్ద కిడ్నాప్ చేసి కళ్ళు చెదిరే డబ్బు సంపాదించాడు.అప్పటినుంచి అతనికి డబ్బంటే ఇష్టం పెరిగింది.అదే క్రమంలో కొకైన్ సరఫరా చేసే అవకాశం లభించింది.

దాన్ని విస్తరించగలమని అతడు గ్రహించాడు.తెలివితో 1975లో సొంత స్మగ్లింగ్ సిస్టమ్‌ బిల్డ్ చేశాడు.

ఒకానొక దశలో మంత్లీ 70 నుంచి 80 టన్నుల కొకైన్‌ను( Cocaine ) తయారు చేసిన ఘనత ఇతడికి ఉంది.ఆ డ్రగ్స్‌ కొలంబియా నుంచి అమెరికాకు పంపిణీ చేసేవాడు.

కి.మీ విస్తీర్ణంలో మోస్ట్ లగ్జరీస్‌ హౌజ్‌ కట్టుకున్నాడు.అందులో రూమ్ చాలా పెద్దగా ఉండే స్విమ్మింగ్ పూల్స్ క్లబ్ హౌస్ ఉండేవి.

విమానాలు దిగడానికి కావలసిన సదుపాయాలు కూడా ఏర్పరచుకున్నాడు.

నౌకలు, జలాంతర్గాముల ద్వారా కూడా స్మగ్గింగు చేసేవాడు.డబ్బు అధికారుల ఫేస్ పై డబ్బు పడేసి తనపై కేసు లేకుండా చూసుకునేవాడు.డబ్బుకు కూడా లొంగని న్యాయమూర్తుల్ని, పోలీసుల్ని, అధికారుల్ని అత్యంత దారుణంగా హత్య చేయించేవాడు.

డ్రగ్స్ వార్ కారణంగా కొన్ని వేలమంది చచ్చిపోయేవారు.తర్వాత ఇతను రాజకీయాల్లో చేరి ఛాంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ నెంబర్ అయ్యాడు.

పేదలకు ఇల్లు కట్టించాడు.ఫుట్‌బాల్ గ్రౌండ్స్‌ నిర్మాణానికి నిధులు ఇచ్చాడు.

అమెరికన్ స్పెషల్ యాంటీ డ్రగ్స్ టీమ్స్ అతడిని టార్గెట్ చేయడంతో తనే శిక్ష వేయించుకున్నాడు.విలాసవంతమైన సొంత జైలు "లా కాటెడ్రల్" కట్టించుకొని అందులోనే శిక్ష అతనికి వేసేలాగా తీర్పు చెప్పించుకున్నాడు.

అక్కడి నుంచే వ్యాపార కార్యకలాపాలు సాగించాడు.అయితే టెక్నాలజీ సాయంతో అతడిని కనిపెట్టి స్పెషల్ టీమ్స్ బుల్లెట్ల వర్షం కురిపించాయి.

తలకు బుల్లెట్ తగిలి అది చెవి నుంచి మెదడులోకి దూరింది దాంతో అతడు చనిపోయాడు.చనిపోయే సమయానికి అతడి వయసు 44 ఏళ్లే!.

తాజా వార్తలు