ఇండియన్ క్రికెట్ టీమ్ ప్రస్తుతం ప్రపంచం లోనే నెంబర్ వన్ టీమ్ గా కొనసాగుతుంది.
ఇక ఇలాంటి సమయం లో ప్లేయర్లను ఎంకరేజ్ చేస్తూ బిసిసిఐ( BCCI ) రీసెంట్ గా ప్లేయర్ల వార్షిక కాంట్రాక్ట్ లను అనౌన్స్ చేసింది.
ఇక ప్రస్తుతం దీని పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది.ముఖ్యంగా వరల్డ్ కప్ లో 500 లకు పైన పరుగులు చేసిన నాలుగోవ ప్లేయర్ గా నిలిచిన శ్రేయస్ అయ్యర్( Shreyas Iyer ) యొక్క కాంట్రాక్ట్ ను రద్దు చేసింది.
ఇక ఈ విషయాన్ని ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు.ఇక శ్రేయస్ అయ్యర్ తో పాటు ఇషాన్ కిషన్( Ishan Kishan ) కాంట్రాక్టు కూడా రద్దు చేశారు.
ఇక ఇప్పుడు ఇదే విషయం పైన మాజీ క్రికెటర్లు కూడా తీవ్ర స్థాయిలో బిసిసిఐ పైన మండిపడుతున్నారు.గత సంవత్సరం లో ఇషాన్ కిషన్ సీ గ్రేడ్ లో, శ్రేయాస్ అయ్యర్ బి గ్రేడ్ లో కాంట్రాక్ట్ ను దక్కించుకున్నారు.
ఇక వీళ్ళు అవకాశం దొరికిన ప్రతిసారి టీమిండియా కి ఎనలేని సేవలను అందిస్తూ వస్తున్నారు.అలాంటి వీళ్ళ కాంట్రాక్ట్ ఎందుకు రద్దు చేశారనే డౌట్ మనలో చాలా మందికి వస్తుంది.
నిజానికి ఇంటర్నేషనల్ మ్యాచ్ లు లేనప్పుడు ప్రతి ఒక్కరూ దేశవాళీ మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది.కానీ వీళ్లిద్దరు అలా ఆడకుండా ఖాళీ గా ఉంటున్నారనే ఉద్దేశంతోనే వాళ్ల కాంట్రాక్టును రద్దు చేశామని బిసిసిఐ క్లారిటీ గా చెప్తుంది.
అయితే ఇక ఇదే అంశం పైన మాజీ సీనియర్ ప్లేయర్ అయిన ఇర్ఫాన్ పఠాన్( Irfan Pathan ) మాట్లాడుతూ 2018 తర్వాత నుంచి ఒక్క దేశవాళి క్రికెట్ మ్యాచ్ కూడా ఆడని హార్దిక్ పాండ్యాకి( Hardik Pandya ) ఏ గ్రేడ్ కాంట్రాక్ట్ ని అప్పగించి ఇషన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ లాంటి ప్లేయర్లను మాత్రం కాంట్రాక్ట్ నుంచి తప్పించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటు ఆయన కొంచెం ఘాటుగానే రియాక్ట్ అయ్యాడు.ఇక మనకి ఒక న్యాయం, ఇంకొకరికి మరో న్యాయం అనే విధంగా బిసిసిఐ నిర్ణయాలు తీసుకుంటుంది అంటూ ఆయన విమర్శించాడు.ఇక ఇప్పుడు పఠాన్ మాట్లాడిన మాటలు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ అభిమానులకి బాసటగా నిలుస్తున్నాయి.
ఇక బిసిసిఐ హార్థిక్ పాండ్యా కి ఏ గ్రేడ్ ఇవ్వడం పైన ఒక క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేసింది.
తను చాలా నిలకడగా మ్యాచ్ లు ఆడుతూ వస్తున్నాడు.కాబట్టి అతనికి ఏ గ్రేడ్ అప్పగించినట్టుగా, అలాగే తను ఇంటర్నేషనల్ మ్యాచ్ లకు ఆడలేని క్రమంలో దేశవాళీ మ్యాచులకు ఆడతానని అది కూడా వైట్ బాల్ మ్యాచ్ లను మాత్రమే ఆడతానని చెప్పాడు.ఇక రెడ్ మ్యాచులకు తను అవలేబుల్ లో ఉండనని ముందే చెప్పాడని దానివల్ల అతను రంజీ ట్రోఫీ( Ranji Trophy ) ఆడాల్సిన పని లేకుండా పోయిందని అందువల్లే హార్దిక్ పాండ్యా కాంట్రాక్ట్ ని కంటిన్యూ చేసామని బిసిసిఐ ఒక క్లారిటీ అయితే ఇచ్చింది.
ఇక గత సంవత్సరం జరిగిన వన్డే వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ తో ఆడిన మ్యాచ్ లో హార్థిక్ పాండ్యా కాలికి గాయం అవ్వడంతో అప్పటినుంచి ఇప్పటివరకు ఇంకా తను ఆ గాయం నుంచి కోలుకోలేదు.ఇక ఐపిఎల్ కి అందుబాటులోకి వస్తాడేమో చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy