ఏపీ రాజకీయాలకు సినీ పెద్దలు ఎందుకు దూరంగా ఉంటున్నారు ? 

ఏపీ లో రాజకీయం వేడెక్కింది.ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యవహారాల్లో బిజీగా ఉన్నాయి.

ప్రస్తుతం అన్ని ప్రధాన పార్టీల అధినేతలు ప్రచారం మొదలుపెట్టారు.ప్రజల్లోకి వెళ్తూ తాము అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తాం .ఏవిధంగా అభివృద్ధి చేస్తాం .ఏ సంక్షేమ పథకాలు అందిస్తామో చెబుతూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.అయితే ఎన్నికల ప్రచారాల్లో సినీ ప్రముఖులు ఎక్కడా కనిపించడం లేదు.

గత ఎన్నికల్లో సినిమా రంగానికి చెందిన ఎంతోమంది వివిధ పార్టీల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అయితే ఇప్పుడు మాత్రం సినీ పరిశ్రమకు( Cinema Industry ) చెందిన వారు ఎవరు పెద్దగా ఏపీ రాజకీయాలపై( AP Politics ) ఆసక్తి చూపించడం లేదు.2019 ఎన్నికల్లో సిని రంగానికి చెందిన చాలామంది ప్రముఖులు వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అయితే ఇప్పుడు వైసీపీ( YCP ) సైతం సినీ పరిశ్రమకు చెందిన వారిని దూరం పెట్టింది.

ఆ రంగానికి చెందిన వారు ఎవరికి టికెట్ ఇవ్వలేదు.

Advertisement

వాస్తవంగా ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సినీ పరిశ్రమకు చెందినవారికి టికెట్లు దొరికేవి.అయితే ఈసారి ఏ పార్టీ సినీ పరిశ్రమకు చెందిన వారికి టికెట్లు ఇవ్వలేదు.వైసీపీ నుంచి రోజా( Roja ) ,టిడిపి నుంచి బాలకృష్ణ, ( Balakrishna ) జనసేన నుంచి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మినహా, మిగతా ఎక్కడా ఆ రంగానికి చెందినవారు కనిపించడం లేదు.

కనీసం ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కూడా అంతగా ఆసక్తి చూపించడం లేదు.సినిమా రంగానికి చెందిన వారికి అన్ని పార్టీలు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటి కారణాలతో, వారి హడావుడి ఎక్కడా కనిపించడం లేదు.

సినిమా హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు.జనసేన పార్టీకి అధినేత గారు కొనసాగుతున్నారు.దీంతో ఆ పార్టీ వైపు సినిమా రంగానికి చెందిన వారు ఎక్కువ మొగ్గు చూపించే పరిస్థితులు ఉన్నా.

పవన్ వారిని ప్రోత్సహించడం లేదట.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

ఇక గత ఎన్నికల్లో మెజారిటీ సినీ ప్రముఖులు వైసీపీకి మద్దతు తెలిపారు.మోహన్ బాబు, ఆలీ, పోసాని కృష్ణ మురళి, పృద్వీ, భానుచందర్ ఇలా చాలామంది ఉన్నారు.ఆ సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉండడం,  వైసీపీతో ఆ పార్టీ సఙ్ఖతగా మెలగడం వంటివి కలిసి వచ్చాయి.

Advertisement

అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, సినీ పరిశ్రమ హైదరాబాదులోనే కొనసాగుతూ ఉండడం వంటి కారణాలతో ఏపీ రాజకీయాలపై సినీ ప్రముఖుల ఎవరూ ఆసక్తి చూపించకపోవడనికి కారణమట.

తాజా వార్తలు