యూఎస్ లో దారుణంగా పడిపోయిన 'ఆచార్య' ప్రీ సేల్స్.. అందుకు కారణం ఇదేనా?

ప్రెసెంట్ టాలీవుడ్ లో ఆచార్య మ్యానియా నడుస్తుంది.చిరంజీవి, రామ్ చరణ్ కలిసి టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించిన సినిమా ఆచార్య.

ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.ఇందులో రామ్ చరణ్ సిద్ధ అనే పవర్ ఫుల్ రోల్ లో నటించాడు.

చిరు కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తే రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది.చిరు, చరణ్ ఇద్దరు కూడా ఈ సినిమాలో కలిసి నటించడం వల్ల ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రొమోషన్స్ స్పీడ్ గా చేస్తూన్నారు మేకర్స్.ఈ వరుస అప్డేట్ లు కూడా మెగా అభిమానులను ఆకట్టుకున్నాయి.

Advertisement

అలాగే ఈ సినిమా మరో రెండు రోజుల్లో రానున్న క్రమంలో వరుసగా ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూ లు చేస్తూ టీమ్ అంతా బిజీగా గడుపు తుంది.ఈ నేపథ్యంలో ఒక వార్త ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ను కలవరానికి గురి చేస్తుంది.

ఆచార్య సినిమా యూఎస్ మార్కెట్ పై అంత ప్రభావం చూపలేక పోతుందని టాక్.ఇప్పటికే ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్ 2 సినిమాలు రిలీజ్ అయ్యి సూపర్ హిట్లు సాధించాయి.

అంతేకాదు భారీ కలెక్షన్స్ కూడా సాధించాయి.అయితే ఈ రెండు సినిమాల తర్వాత రెగ్యురల్ కమర్షియల్ సినిమాలపై యుఎస్ ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది.

అక్కడ ఆచార్య అడ్వాన్స్ బుకింగ్స్ సేల్స్ చాలా తక్కువుగా ఉండడంతో ఇలాంటి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆ నటుడు నన్ను చూపుతోనే భయపెట్టాడు.. రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
నడుము అందాలతో తెల్ల చీరలో క్యూట్​గా పూజా

ఈ సినిమా ఈ శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.అలాగే రేపే యుఎస్ లో ప్రీమియర్స్ పడనున్నాయి.చాలా రోజుల క్రితం అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినా కూడా ప్రీ సేల్స్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు.

Advertisement

ఆచార్య సినిమాపై అక్కడి ప్రేక్షకులు ఆసక్తి కనబర్చడం లేదని అర్ధం అవుతుంది.మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత అయినా బజ్ ఏర్పడి కలెక్షన్స్ సాధిస్తుందో లేదో చూడాలి.

తాజా వార్తలు