ఎన్టీఆర్‌ అడిగితే తిరస్కరించిన అనసూయ

యాంకర్ అనసూయ చాలా అంటే చాలా బిజీగా ఉంది.ఓవైపు టీవి ప్రోగ్రామ్స్ చేస్తూనే మరోవైపు సినిమాలు కూడా సైన్ చేస్తోంది.

విన్నర్ సినిమాలో ఐటమ్ సాంగ్, చిన్న పాత్ర చేసిన అనసూయ, ఆ సినిమా వలన తనకు ఎలాంటి మైలేజి దొరక్కపోవడంతో, ఇకనుంచైనా పాత్రలు ఏరికోరి ఎంచుకోవాలి అనుకుంటోంది.అందుకే చాలా సినిమాలని రిజెక్ట్ చేసిన ఈ యాంకర్, మంచి పాత్ర దొరకడంతో సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న "రంగస్థలం 1985" సినిమా చేస్తోంది.

అలాగే మోహన్ బాబు - మదన్ ( పెళ్ళైన కొత్తలో, గుండె ఝల్లుమంది) డైరెక్షన్లో రాబోతున్న సినిమా ఒప్పుకుందని తాజా సమాచారం.ఇందులో అనసూయ హీరోయిన్ గా కనిపించబోతోంది అనే టాక్ కూడా వినిపిస్తోంది‌.

ఇంత బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టే, ఎన్టీఆర్‌ ఇచ్చిన ఆఫర్ ని వదిలేసుకుంది అనసూయ.ఎన్టీఆర్‌ సినిమాలో ఆఫర్ అలా ఎలా వదిలేసుకుంది అని ఆశ్చర్యపోతున్నారా ? ఎన్టీఆర్ ఆఫర్ ఇచ్చింది సినిమాలో కాదు, బిగ్ బాస్ గేమ్ షోలో.మధ్యలో రావడం ఏమిటి అనుకుంటున్నారా ? దాన్నే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటారు.అంటే స్పెషల్ ఎంట్రీ అన్నమాట.

Advertisement

కాని బిజీ షెడ్యూల్ వలన బిగ్ బాస్ లోకి రాలేనని చెప్పేసిందట అనసూయ.దాంతో మరో గ్లామర్ తార కోసం వెతుకుతున్నారు మేకర్స్.

తేజస్వీ మడివాడ పేరు గట్టిగా వినిపిస్తోంది.ఇక బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, నిన్న జ్యోతి షో లోంచి ఎలిమినేట్ అయిపోయింది.

మధుప్రియ, కత్తి మహేష్, కత్తి కార్తిక, హరితేజ మరియు జ్యోతి ఎలిమినేషన్ రౌండ్ కి నామినేట్ అవ్వగా, జ్యోతి బిగ్ బాస్ లోంచి ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టంట్ గా నిలిచింది.ఇక ముమైత్ ఖాన్ ఒక్కరోజు కోసం బిగ్ బాస్ ఇంటినుంచి బయటకి రానుంది‌.

టాలివుడ్ డ్రగ్స్ వివాదంలో తన పేరు కూడా ఉందిగా.ముమైత్ ని ఈ నెల 27వ తేదిన విచారించనున్నారు సిట్ అధికారులు.

Advertisement

తాజా వార్తలు