Aishwarya : తన చెప్పుతో తానే కొట్టుకున్న నటి ఐశ్వర్య..ఎందువల్ల ?

మనకేదైనా దక్కాలంటే గట్టిగా రాసిపెట్టి ఉండాలి.అలాంటప్పుడే అది మనం ఎదురు చూడకపోయినా మన దగ్గరికి వచ్చి చేరుతుంది.

కానీ కొన్నిసార్లు మనం అనుకున్న కూడా కొన్ని పనులు చేయలేక పోతాము .దాని వల్ల జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది.ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఎందువల్ల అది కోల్పోయామో తెలిస్తే చాలా బాధేస్తుంది.

అలాంటి ఒక సంక్లిష్ట పరిస్థితుల్లోనే నటి ఐశ్వర్య( Aishwarya Bhaskaran ) ఉన్నారు.ఆమె తన తల్లి తీసిన సినిమాతోనే హీరోయిన్ గా వెండి తెరపై తెరంగేట్రం చేశారు.

అలా హీరోయిన్ గా సెటిల్ అవ్వాల్సిన ఐశ్వర్య ఆ తర్వాత అనేక కారణాల చేత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయారు.అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను మణిరత్నం( Mani Ratnam ) సినిమాలో అనేక సార్లు హీరోయిన్ గా ఎంపిక అయినా కూడా ఎందుకు చేయలేక పోయాను అని తన వృత్తిగత జీవితం లోని కొన్ని విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.వాటి గురించిన వివరాలను ఓసారి తెలుసుకుందాం.

Advertisement

మణిరత్నం తీసిన రోజా సినిమా( Roja ) మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది.ఈ సినిమా మ్యూజికల్ గా ఎంత పెద్ద హిట్ అయిందో అలాగే సినిమా కూడా అంతే పెద్ద హిట్ అయింది.ఈ సినిమాలో మధుబాల పాత్ర కోసం తొలుత లక్ష్మి కుమార్తె అయిన ఐశ్వర్య ని సంప్రదించారట.

కానీ ఆ సమయంలో తెలుగులో మరో చిత్రం కోసం అడ్వాన్స్ తీసుకున్నారు కాబట్టి డేట్స్ సమస్య వస్తుంది అని ఐశ్వర్య అమ్మమ్మ చెయ్యడం కుదరదు అని చెప్పిందట.అలా రోజా సినిమా తన నుంచి ఐశ్వర్య వెళ్ళిపోయింది.

ఇక ఆ సినిమా చూసిన తర్వాత రోజా స్థానంలో తాను లేనందుకు ఐశ్వర్య చాలా బాధపడిందట.సినిమా థియేటర్ నుంచి ఇంటికి వెళ్లి డోరుని గట్టిగా తన్ని అక్కడే ఉన్న చెప్పుతో తనను తానే కొట్టుకున్నారట.

అంత మంచి పాత్రను పోయేలా చేసినందుకు అమ్మమ్మని చంపేద్దామని అంత కోపం కూడా వచ్చిందట.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి

ఇక క్షత్రియ పుత్రుడు( Kshatriya Putrudu ) సినిమాలో గౌతమి పాత్ర కోసం కూడా మణిరత్నం తోలుత ఐశ్వర్య సంప్రదించారట.ఆ సమయంలో కూడా డేట్స్ సమస్య వచ్చి తాను చేయలేకపోయారట.ఇక అన్నిటి కన్నా ముందు దళపతి సినిమాలో శోభన పాత్ర కోసం ఐశ్వర్య నటించాల్సి ఉండగా అప్పుడు కూడా డేట్స్ సమస్య వచ్చి దళపతి సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందట.

Advertisement

ఆ టైంలో ఐశ్వర్య హీరోయిన్ గా పిక్ కెరియర్ ని చూస్తున్నారు.అందువల్లే ఈ సినిమాలు చేయలేకపోయారు.తిరుడా తిరుడా అనే సినిమాను దొంగ దొంగ పేరుతో తెలుగులో కూడా డబ్బింగ్ చేశారు ఈ చిత్రంలో కూడా మన్నత్వం ఐశ్వర్య అని అడిగారట ఇలా ఎన్నిసార్లు అడిగినా వీరి కాంబినేషన్ కుదరలేదు.

మణిరత్నం తీసి అడిగిన నాలుగు సార్లు కూడా తను చేయలేక పోయినందుకు ఐశ్వర్య చాలా బాధపడ్డారట.కానీ ఐశ్వర్య కెరీర్ మాత్రం పతనం అయింది.

దాంతో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయింది.

తాజా వార్తలు