Archana : సినిమాల్లో అవకాశాలు రాకపోతే పక్క వాళ్ళ పై పడి ఏడ్వడం ఎందుకు ?

అర్చన( Archana )తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ అవ్వాలని, ఒక వెలుగు వెలగాలని కోరికతో ఎంట్రీ ఇచ్చింది.

కానీ ఆమె పేరు కోరిక పెద్దగా నెరవేరకపోయినా కొన్ని గుర్తింపు ఉన్న సినిమాల్లో నటించి ప్రస్తుతం తెలుగు తెరపై నుంచి నిష్క్రమించింది.

అయితే తను సినిమాల్లో అవకాశాలు సంపాదించుకోకపోవడానికి గల కారణం పలానా సినిమాలో నటించడం వల్లే అంటూ పలు ఇంటర్వ్యూలలో చెబుతూ ఉంటుంది.మరి 2002 లో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 20 ఏళ్ల అయిపోతున్న ఆమె ఒక సినిమా గురించి బాధపడుతుంది అంటే విడ్డూరంగా ఉంది.

మరి అర్చన నటించిన ఆ సినిమా ఏంటి ? ఎందువల్ల ఆమె కెరియర్ క్లోజ్ అయింది అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

తపన( Tapana Movie ) అనే సినిమా ద్వారా ఆ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అర్చన ఆ తర్వాత అల్లరి నరేష్ హీరోగా నేను అనే ఒక ఎమోషనల్ డ్రామా లో నటించి పర్వాలేదు అనిపించుకుంది.ఇక ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి ఒక సినిమాలో హీరోయిన్ కి ఫ్రెండ్ పాత్రలో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ చేసింది.దాదాపు ఈ సినిమాలో నటించిన తర్వాత కూడా మలయాళం కన్నడ తెలుగులో చాలా సినిమాల్లోనే నటించింది కానీ చాలా సార్లు ఆ చిత్రంలో సపోర్టింగ్ క్యారెక్టర్ చేయడం వల్లే తాను మళ్ళీ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకోలేదు అనే భ్రమలో ఉంది అర్చన.

Advertisement

అయితే ఒక భాషలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తే పోయిందేముంది ఆమెది కావాలనుకుంటే ఏ చిన్న సినిమాలో అయినా హీరోయిన్ గా నటించి ఉండవచ్చు ఆ సినిమా తర్వాత చాలా సినిమాల్లో మెయిన్ లీడ్ పాత్రల్లోనే నటించింది.

కానీ ఒక చిత్రం మళ్ళీ తన కెరీర్ పాడైపోయినట్టు ఫీల్ అవుతోంది.ఇప్పుడు చాలామంది హీరోయిన్స్ ఒక భాషలో ఫ్లాప్ అయితే మరో భాషలోకి వెళ్ళిపోతున్నారు అక్కడ చిన్న ఓ పెద్దవో ఏదో ఒక సినిమా చేస్తున్నారు కానీ అర్చన చాలా తక్కువ సమయంలోనే ఇక సినిమా ఇండస్ట్రీకి తాను పనికి రాను అని డిసైడ్ అయ్యింది ఇందులో ఎవరి తప్పులేదు కేవలం ఆమె సరిగ్గా అవకాశాల కోసం ఎదురు చూడకుండా ఉండటమే ఆమె చేసిన తప్పు దానికోసం ఒక పెద్ద సినిమా వాళ్ళ జీవితం పాడైపోయింది అని బాధపడటంలో అర్థం లేదు ఈ చిత్రానికి ఆమె బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ గా ఫిలింఫేర్ అవార్డు కి కూడా నామినేట్ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు