మధుమేహులే కాదు సపోటా పండ్లు వారు కూడా తినకూడదని మీకు తెలుసా..?

ఈ ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన పండ్ల‌లో సపోటా( Sapota ) ఒకటి.

మధురమైన రుచిని కలిగి ఉండడం వల్ల పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా సపోటా పండ్లను తింటూ ఉంటారు.

అలాగే మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో ముఖ్యమైన పోషకాలను మనం సపోటా పండ్ల ద్వారా పొందవచ్చు.అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ కొందరు మాత్రం సపోటా పండ్ల‌ను దూరం పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.

ఆ కొందరు ఎవరు.? ఎందుకు వారు సపోటా పండ్ల‌ను తినకూడదు.? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.మ‌ధుమేహం( Diabetes ) ఉన్న వారు స‌పోటా పండ్ల‌కు దూరంగా ఉండాలి.

ఈ విష‌యం ఆల్మోస్ట్ అందరికీ తెలుసు.సపోటాలో గ్లైసెమిక్ ఇండెక్స్ త‌క్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.

Advertisement

అందుకే మ‌ధుమేహులు స‌పోటాను తిన‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని నిపుణులు సూచిస్తారు.

అలాగే జ‌లుబు మ‌రియు ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌వారు స‌పోటా పండ్ల‌ను తీసుకోక‌పోవ‌డ‌మే ఉత్త‌మం.ఎందుకంటే ఆయా స‌మ‌స్య‌ల‌ను స‌పోటా మ‌రింత తీవ్ర‌త‌రం చేస్తుంది.సపోటాలో ఫైబర్( Fiber ) అధికంగా ఉంటుంది.

ఇది ప్రకోప ప్రేగు సిండ్రోమ్ లేదా ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి ఉన్నవారిలో జీర్ణం అవ్వ‌డం క‌ష్టంగా ఉంటుంది.కాబ‌ట్టి అలాంటి వారు కూడా స‌పోటాను ఎవైడ్ చేయాలి.

రబ్బరు పాలు అలెర్జీలు ఉన్నవారు స‌పోటా పండ్ల‌కు దూరంగా ఉండాలి.సపోటా లో ప్రొటీన్లు( Proteins ) అధికంగా ఉంటాయి, ఇవి కొంతమందిలో అలెర్జీ ప్రతిచర్యలను ప్రేరేపించగలవు.పిల్ల‌ల‌కు కూడా స‌పోటా పండ్ల‌ను చాలా మితంగా ఇవ్వాలి.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్ట్‌.. ఇది ముంబై సిటీ కంటే పెద్దది..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జులై 5,సోమవారం, 2021

ఎందుకంటే, సపోటా ఎక్కువగా తినడం వల్ల కొంత‌మంది పిల్ల‌ల్లో అలర్జీలు( Allergies ) లేదా శ్వాస సమస్యలు త‌లెత్తుతాయి.ఇక ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో స‌పోటా తినొచ్చా.? లేదా.? అన్న డౌట్ చాలా మందికి ఉంటుంది.గర్భధారణ సమయంలో ఎటువంటి భ‌యం లేకుండా స‌పోటా పండ్ల‌ను తినొచ్చు.

Advertisement

గర్భిణీ స్త్రీలకు అత్యంత సిఫార్సు చేయబడిన పండు ఇది.తల్లి మరియు బిడ్డకు అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల ఖనిజాలు, విటమిన్లు, ఆరోగ్యకరమైన కేలరీలు మ‌రియు యాంటీ ఆక్సిడెంట్లు స‌పోటాలో ఉంటాయి.

తాజా వార్తలు