బ్లాక్ బస్టర్ హిట్ వెంకీ సినిమాని కోల్పోయిన ఇద్దరు యాక్టర్స్.. ఎవరంటే.. ?

20 ఏళ్ల క్రితం వచ్చిన కామెడీ థ్రిల్లర్ ఫిల్మ్ వెంకీ (2004)( Venky Movie ) బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

ఇందులోని కామెడీ అద్భుతంగా ఉంటుంది.

ఇప్పటికీ ఆ కామెడీ చూస్తూ నవ్వుకునే ప్రేక్షకులు ఉన్నారు.పాటలు కూడా ఉర్రూతలూగిస్తాయి.

శ్రీను వైట్ల( Srinu Vaitla ) డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రవితేజ,( Ravi Teja ) స్నేహ, అశుతోష్ రానా ప్రధాన పాత్రల్లో నటించారు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే అతి కొద్ది సినిమాల్లో ఇది కూడా ఒకటి.

Advertisement

అయితే ఇంత మంచి సినిమాలో భాగమయ్యే అవకాశాన్ని ఇద్దరు యాక్టర్లు కోల్పోయారు.వారెవరో తెలుసుకుందాం.

దాని కంటే ముందు ఈ సినిమాలో ట్రైన్ సీక్వెన్స్ గురించి మాట్లాడుకోవాలి.దాని వల్లనే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.నిజానికి ఈ సినిమాలో ట్రైన్ సీక్వెన్స్ పెట్టాలని ముందుగా ఎవరనుకోలేదు.

ఒకరోజు షూటింగ్ పూర్తిచేసుకుని రిటర్న్ అవుతుండగా మూవీ టీం అంతాక్షరి ఆడింది.అయితే ఈ వినోదాన్ని చూసి శ్రీను వైట్ల ఇది ఏదో బాగుందే, దీన్ని సినిమాలో యాడ్ చేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నారు.

ఇతర మూవీ టీమ్‌ మెంబర్స్ కూడా ఆయన ఆలోచనతో అంగీకరించారు.దాంతో ఈ ట్రైన్ సీక్వెన్స్ ను బాగా డెవలప్ చేసి మంచి కామెడీ యాడ్ చేసి సినిమాలో పెట్టారు.

జూనియర్ ఎన్టీఆర్ కు ఫ్లాప్ ఇచ్చి బాలయ్యకు హిట్ ఇచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా?
సినిమాల్లో రీఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చిన రంభ.. ఆ ఆశ మాత్రం నాకు లేదంటూ?

ఈ మూవీలో స్నేహకి( Sneha ) బదులు గజినీ ఫేమ్ ఆసిన్‌ను( Asin ) తీసుకోవాలని శ్రీను వైట్ల భావించారు.కానీ ఎందుకో ఆమె నటించడానికి ఆసక్తి చూపించలేదు.ఆసిన్ ఈ సినిమాలో నటించక పోవడానికి గల కారణం కచ్చితంగా తెలియదు.

Advertisement

స్నేహ మాత్రం ఇందులో హీరోయిన్ రోల్ కు కరెక్ట్ గా సూట్ అయింది."గోంగూర తోట కాడ కాపు కాచు" పాటకు అద్భుతంగా డాన్స్ చేసి ఒక ఊపు ఊపేసింది.

ఆ విధంగా ఆసిన్‌ ఒక మంచి మూవీ పోగొట్టుకుంది.ఈ సినిమాని కోల్పోయిన మరొక యాక్టర్ ఎమ్ ఎస్ నారాయణ.

( MS Narayana ) ఈ కమెడియన్ ను ట్రైన్ సీక్వెన్స్ లో ఇంక్లూడ్ చేయాలని శ్రీను వైట్ల ఎంతో ప్రయత్నించాడు కానీ ఫెయిల్ అయ్యాడు.ఒకవేళ ఎమ్మెస్ నారాయణను తీసుకొని ఉంటే ఈ కామెడీ ట్రాక్ మరింత పండి ఉండేది.

తాజా వార్తలు