తండ్రి లేని కుటుంబంలా మారిన సినిమా పరిశ్రమ.. అస్సలు పెద్ద ఎవరు ?

సినీ పరిశ్రమలో పెద్దదిక్కు ఎవరా అనే ప్రశ్న దాసరి మరణం తర్వాత అనేకసార్లు ఉత్పన్నమవుతోంది.

అందుకు గల కారణం దాసరి అందరికీ పెద్ద దిక్కుగా ఉంటూ కార్మికుల కష్ట నష్టాలు, వారి సమస్యలను అర్థం చేసుకొని ఎవరినైనా నిక్కచ్చిగా నిలదీయగలిగిన మనిషి కాబట్టి అందరికీ ఆయనే పెద్దదిక్కు.

ఆయన దగ్గరికి ఒక సమస్య ఉంది అని వెళితే ఖచ్చితంగా అది ఏదో ఒక రకంగా పరిష్కారం అయ్యేది.అందుకే దాసరి మరణానంతరం తండ్రి లేని కుటుంబంలా సినిమా పరిశ్రమ తల్లడిల్లుతోంది.

దాసరి మరణానంతరం చాలా మంది సినిమా పరిశ్రమకు పెద్దవాడిగా ఉండాలని భావిస్తున్నప్పటికీ కొంతమందికి కొన్ని హద్దులు ఉన్నాయి.తమ్మారెడ్డి భరద్వాజ్, సి కళ్యాణ్, మోహన్ బాబు లాంటి వారి పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి.

దాసరి తర్వాత చాలామంది అప్పట్లో తమ్మారెడ్డి దగ్గరికి తమ సమస్యలను చెప్పుకోవడానికి వెళ్లేవారు.ఎందుకంటే తమ్మారెడ్డి సైతం చాలా ఏళ్లుగా అందరితో సుముఖంగానే ఉంటూ వస్తున్నారు.

Advertisement

అయితే ఇప్పుడు ఇంత మంది పేర్లు వినిపిస్తున్న చిరంజీవి సైతం సినిమా పెద్దగా ఉండడానికి అర్హత ఉన్న వ్యక్తిగా ఆయన అభిమానులు పేర్కొంటున్నారు.అయితే వివాదాలకు దూరంగా ఉండే చిరంజీవి ఎంతవరకు సినిమా పరిశ్రమకు పెద్దగా ఉండడానికి ఒప్పుకుంటారు అనేదే అసలు చిక్కు ప్రశ్న.

ఇక అనేక మంది పేర్లు ప్రచారంలోకి వచ్చేసరికి తమ సమస్యలను చెప్పుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియని అయోమయ పరిస్థితిలలో సినీ కార్మికులు ఉన్నారు.

పైగా సమస్యలను పరిష్కరించాలంటే తనకు న్యాయం అనిపించింది ఎలాగైనా సరే చేయగలిగే గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉండాలి.మరి ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్, కళ్యాణ్, మోహన్ బాబులలో ఆ పరిస్థితి ఎవరికి ఉంది అనేది ప్రశ్నార్ధకమే.చిరంజీవి తనను తానుగా పెద్దగా ఉండలేను అని చెప్పిన తర్వాత వీరిలో ఎవరో ఒకరు పెద్దగా అవతరించాలని బాగానే ప్రయత్నిస్తున్నప్పటికీ కార్మికులకు దగ్గరైన వ్యక్తి మాత్రమే సినీ పెద్దగా ఉండగలరు.

లైట్ బాయ్ నుంచి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్ల వరకు ప్రతి ఒక్కరితో సమన్వయ పరచగలిగే నిర్ణయాత్మక ధోరణి కలిగి ఉండాలి.నిజంగా అలాంటి వ్యక్తి వీరిలో ఉన్నారా అంటే అది కూడా సందేహమే.

మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ కావడంతో డబ్బులు వెనక్కు ఇచ్చేసిన హరీష్ శంకర్.. ఎన్ని రూ.కోట్లంటే?
ఇంతకీ ఆ గోడ కట్టింది ఎవరు ? టీడీపీ వర్సెస్ వైసిపి

అందుకే ప్రస్తుతం సినిమా పరిశ్రమకు పెద్ద అనే పేరు అత్యంత ప్రశ్నార్థకంగా మారింది.

Advertisement

తాజా వార్తలు